Sharwanand Aadavallu Meeku Joharlu Movie Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Sharwanand New Movie: షూటింగ్‌ పూర్తి చేసుకున్న ‘ఆడవాళ్లు మీకు జోహర్లు’

Published Tue, Feb 15 2022 10:21 AM | Last Updated on Tue, Feb 15 2022 11:23 AM

Sharwanand, Rashmika Mandanna Wrap Up Aadavallu Meeku Joharlu Movie - Sakshi

యంగ్‌ హీరో శర్వానంద్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’.  కిశోర్​ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్​ బ్యానర్​పై సుధాకర్​ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మూవీ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.



ఇంతవరకూ కూడా ఎప్పటి పనులను అప్పుడు పూర్తిచేస్తూ వచ్చారు. ఈ కారణంగానే ఈ సినిమాను ఈ నెల 25వ తేదీన థియేటర్లకు తీసుకురానున్నారు. దేవిశ్రీ ప్రసాద్ నుంచి వదిలిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ ను బట్టే ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే విషయం అర్థమైపోతోంది. హీరో పెళ్లి చూపుల ఎపిసోడ్ ఈ సినిమాలో ప్రధానమైన హాస్యాన్ని పండించనుంది. ఈ సినిమాలో రాధిక .. ఖుష్బూ .. ఊర్వశి ముఖ్యమైన పాత్రలను పోషించారు. కొంతకాలంగా వరుస పరాజయాలతో వెనుకబడిన శర్వానంద్ కి ఈ సినిమా ఊరటనిస్తుందేమో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement