11 ఏళ్లకే గడ్డం ఇవ్వమని రోజు దేవుడికి మొక్కుకునే వాడిని: సిద్ధార్థ్‌ | Hero Siddharth Talks About Sharwanand In a Interview | Sakshi
Sakshi News home page

Siddharth: 11 ఏళ్లకే గడ్డం ఇవ్వమని రోజు దేవుడికి మొక్కుకునే వాడిని: సిద్ధార్థ్‌

Published Fri, Nov 12 2021 4:25 PM | Last Updated on Fri, Nov 12 2021 4:39 PM

Hero Siddharth Talks About Sharwanand In a Interview - Sakshi

Hero Siddharth About Sharwandh: శర్వానంద్‌ గడ్డం చూసినప్పుడల్లా అసూయగా ఉంటుందంటూ హీరో సిద్ధార్థ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వారిద్దరు నటించిన మహా సముంద్రం మూవీ విడుదలైన అనంతరం శర్వానంద్‌తో కలిసి సిద్ధార్థ్‌ సాక్షి టీవీతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్‌ తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకన్నాడు. ఈ సందర్భంగా తను తన తండ్రి పోలికా అని ఆయనలాగే చాలా ఏళ్లకు గాని తనకు గడ్డం రాలేదన్నారు.

చదవండి: ‘నా బెస్ట్‌ ఫ్రెండ్‌ ఓ ట్రాన్స్‌జెండర్‌.. ఎన్నో ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేశాను’

ఢిల్లీలో చదువుతున్నపుడు తనకు 11 ఏళ్లని, అప్పుడే తన స్నేహితులకు పెద్ద పెద్ద గడ్డం ఉండేదని చెప్పాడు. దీంతో తనకు కూడా గడ్డం ఇవ్వమని రోజు దేవుడికి మొక్కుకునే వాడినంటూ సిద్ధార్థ్‌ చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పటికీ తనకు అంత గడ్డం పెరగలేదంటూ సిద్ధార్థ్‌ విచారన వ్యక్తం చేశాడు. అందుకే శర్వానంద్‌ గడ్డం చూపినప్పుడల్లా తను జలస్‌ అవుతుంటానని పేర్కొన్నాడు. అలాగే శర్వా నటన అంటే ఇష్టమని, ముఖ్యంగా తన గొంతు అంటే చాలా ఇష్టమని చెప్పాడు. పరిశ్రమలో వారిద్దరూ మంచి స్నేహితులమన్నాడు. ఇక మహా సముంద్రం మూవీతో వారి మధ్య సన్నిహితం మరింత పెరిగిందని సిద్ధార్థ్‌ పేర్కొన్నాడు. 

చదవండి: బోల్డ్‌ సీన్స్‌పై ప్రశ్నించిన రిపోర్టర్‌, పెళ్లి తర్వాత మీరేం చేస్తారన్న హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement