త్వ‌ర‌లో తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో! | Buzz: Sharwanand And His Wife Rakshita Reddy Expecting First Child? | Sakshi
Sakshi News home page

Sharwanand: పేరెంట్స్‌గా ప్ర‌మోష‌న్ పొంద‌నున్న శ‌ర్వానంద్ దంప‌తులు!

Published Mon, Nov 6 2023 7:44 PM | Last Updated on Mon, Nov 6 2023 10:45 PM

Buzz: Sharwanand And His Wife Rakshita Reddy Expecting First Child? - Sakshi

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌లో ఒక‌రైన శ‌ర్వానంద్ ఈ ఏడాదే పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడ‌య్యాడు. జూన్ 3న జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో ర‌క్షితా రెడ్డి మెడ‌లో మూడు ముళ్లు వేసి ఆమెతో ఏడ‌డుగులు న‌డిచాడు. అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన ఈ పెళ్లి వేడుక‌కు టాలీవుడ్ సెల‌బ్రిటీలు సైతం విచ్చేసి సంద‌డి చేశారు. కాగా జ‌న‌వ‌రిలో నిశ్చితార్థం జ‌ర‌గ్గా.. ఆరు నెల‌ల త‌ర్వాత పెళ్లి చేసుకుందీ జంట‌. తాజాగా ఈ దంప‌తుల‌కు సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర వార్త నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది.

త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోష‌న్?
త్వ‌ర‌లోనే శ‌ర్వానంద్- ర‌క్షిత దంప‌తులు త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోష‌న్ పొంద‌నున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్న‌ ర‌క్షిత గ‌ర్భిణీ అని, మెడిక‌ల్ చెక‌ప్స్‌తో పాటు డెలివ‌రీ కూడా అక్క‌డే జ‌ర‌గ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఈ స‌మ‌యంలో భార్య‌కు తోడుగా ఉండేందుకు శ‌ర్వానంద్ కూడా అమెరికా వెళ్లిపోయాడ‌ని, కొంత‌కాలం పాటు అక్క‌డే ఉండ‌బోతున్నాడ‌ని చెప్తున్నారు. మ‌రి ఇదెంత‌వ‌ర‌కు నిజ‌మ‌నేది తెలియాల్సి ఉంది. శ‌ర్వానంద్ స్పందిస్తేనే ఈ విష‌యంపై క్లారిటీ రానుంది.

సినిమాల సంగ‌తేంటి?
ఇదిలా ఉంటే శ‌ర్వానంద్ చివ‌ర‌గా ఒకే ఒక జీవితం సినిమాలో న‌టించాడు. గ‌తేడాది రిలీజైన ఈ సినిమాకు మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. ప్ర‌స్తుతం అత‌డు త‌న 35వ సినిమా చేస్తున్నాడు. దీన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తోంది. ఇందులో ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

చ‌ద‌వండి: ఆ ఇద్ద‌రి కాళ్ల‌కు న‌మ‌స్క‌రించిన లావ‌ణ్య త్రిపాఠి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement