
శర్వానంద్, కృతీ శెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘మనమే’. శర్వానంద్ 35వ సినిమాగా విడుదలకు సిద్దంగా ఉంది. లండన్ నేపథ్యంలో, కొత్తతరం ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై వస్తున్న ఈ చిత్రంలో బాలనటుడు విక్రమ్ ఆదిత్య కీలక పాత్ర పోషిస్తున్నాడు.
తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. శర్వానంద్, కృతీ శెట్టి ఈ చత్రంలో భార్యాభర్తలుగా నటించినట్లు తెలుస్తోంది. వారిద్దరి కుమారుడిగా విక్రమ్ ఆదిత్య ఉన్నాడు. టీజీర్‌లో చాలా ముద్దుగా కనిపిస్తున్న ఆ బాబుకు ఎవరైనా ఫిదా కావాల్సిందే. శమంతకమణి, దేవదాస్,భలే మంచి రోజు వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన శ్రీరామ్ ఆదిత్య 'మనమే' చిత్రంతో ఈ సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
మనమే చిత్రం తర్వాత శర్వానంద్ మరో రెండు చిత్రాలను లైన్‌లో పెట్టారు. అభిలాష్ కంకర దర్శకత్వంలో మాళవికా నాయర్ హీరోయిన్‌గా తన 36వ సినిమాగా రానుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నుంచి 37వ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇలా వరుస సినిమాలతో శర్వా బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment