Sharwanand Reveals About His Accident During Jaanu Movie Shooting, Details Inside - Sakshi
Sakshi News home page

Sharwanand: 15వేల అడుగుల ఎత్తులో ఉన్న ప్లైట్‌ నుంచి దూకాను.. కోలుకోడానికి రెండున్నర ఏళ్లు పట్టింది

Published Fri, Nov 4 2022 3:17 PM | Last Updated on Fri, Nov 4 2022 4:15 PM

Sharwanand Share About Accident While Jaanu Movie Shooting - Sakshi

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో అన్‌స్టాపబుల్‌. ప్రస్తుతం ఇది రెండో సీజన్‌ను జరపుకుంటుంది. ఇటీవల గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ షో మూడో ఎపిసోడ్‌లో యువ హీరోలు శర్వానంద్‌, అడివి శేష్‌లు సందడి చేశారు. ఈ సందర్భంగా జాను మూవీ సమయంలో తనకు జరిగిన ప్రమాదాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అయ్యాడు శర్వానంద్‌. ‘జాను సినిమాలో లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ బాగా హిట్ అయింది. ఆ సాంగ్ షూటింగ్ సమయంలో ఫ్లైట్ నుంచి కిందకి దూకి స్కై డైవింగ్ చేయాలి. దానికోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాను. షూట్ రోజు 15000 అడుగుల ఎత్తులో ఉన్న ఫ్లైట్ నుంచి దూకేశాను. కింద వరకు వచ్చాక పారాచూట్ పని చేయలేదు.

చదవండి: చీటింగ్‌ చేసి ప్రియాంక మిస్‌ వరల్డ్‌ అయ్యిందా? ఆమె కామెంట్స్‌ వైరల్‌

దీంతో కింద పడ్డాను. ఆపరేషన్ అయి రైట్ సైడ్ చేతికి రెండు ప్లేట్స్, 24 నట్లు పడ్డాయి. రైట్ సైడ్ కాలికి ఒక ప్లేట్ పడింది.” అని చెప్పాడు. ఈ ప్రమాదం నుంచి కోలుకోవడానికి రెండున్నర ఏళ్లు పట్టింది. అందరి ప్రార్థనల వల్ల, దేవుడి దయవల్ల కోలుకోగలిగాను. అన్నయ్య, నాన్న, ఫ్రెండ్స్ హాస్పిటల్‌లో నా దగ్గరుండి చూసుకున్నారు. అసలు కోలుకుంటాను అనుకోలేదు. కానీ ఇప్పుడు ఇలా ఉన్నాను. ఆ సంఘటనను మాత్రం నా జీవితంలో ఎప్పటికి మర్చిపోలేను’’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. దీంతో బాలకృష్ణ సైతం గతంలో తనకు జరిగిన ప్రమాదం గురించి చెప్పుకొచ్చాడు. పవిత్ర ప్రేమ సినిమా క్లైమాక్స్ షూటింగ్ సమయంలో బాంబ్ బ్లాస్ట్ ఉంటే దానివల్ల తనకు కూడా ఎఫెక్ట్ అయిందని తెలిపాడు.

చదవండి: అంత ఈజీగా నిందలు ఎలా వేస్తారు? భర్త ఆరోపణలపై నటి ఆవేదన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement