తండ్రైన టాలీవుడ్ యంగ్‌ హీరో.. అప్పుడే పేరు కూడా! | Tollywood Young Hero Sharwanand Blessed with Baby Girl Post Goes Viral | Sakshi
Sakshi News home page

Sharwanand: తండ్రిగా శర్వానంద్‌కు ప్రమోషన్.. కాస్తా ఆలస్యంగా రివీల్!

Published Wed, Mar 6 2024 7:50 PM | Last Updated on Wed, Mar 6 2024 8:14 PM

Tollywood Young Hero Sharwanand Blessed with Baby Girl Post Goes Viral - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌  హీరో శర్వానంద్ గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. జూన్ 3న  రక్షితారెడ్డిని పెళ్లాడారు. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జైపుర్‌లోని లీలా ప్యాలెస్‌ వేదికగా వీరి పెళ్లి ఘనంగా జరిగింది. సుమారు రెండు రోజుల పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో రామ్‌చరణ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.

తాజాగా ఇవాళ శర్వానంద్ బర్త్‌ డే సందర్భంగా అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. శర్వానంద్- రక్షితా రెడ్డి తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఈ విషయాన్ని తన పుట్టిన రోజు సందర్భంగా ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అంతే కాదు తమ ముద్దుల పాపకు లీలా దేవి మైనేని అనే పేరు కూడా పెట్టినట్లు వెల్లడించారు. 

కాగా.. గతేడాది నవంబర్‌లో రక్షితారెడ్డి ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఈ విషయాన్ని ఎక్కడా రివీల్ చేయకుండా శర్వానంద్ జాగ్రత్తపడ్డారు. తాజాగా శర్వానంద్‌ బర్త్‌ డే సందర్భంగా ఏకంగా బిడ్డ పుట్టిన విషయాన్ని రివీల్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు. 

ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా శర్వానంద్ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ వచ్చేశాయి.  శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు ‘మనమే’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్‌లుక్‌ టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించనుంది.

దీంతో పాటు 36వ సినిమాకు సంబంధించిన తాజాగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సినిమాకు అభిలాష్‌ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో మాళవిన నాయర్ హీరోయిన్‌గా కనిపించనుంది.  ఈ సినిమాలో శర్వానంద్ బైక్‌ రైడర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన గతంలో ఈ బ్యానర్‌పై రన్‌ రాజా రన్, ఎక్స్‌ ప్రెస్‌రాజా , మహానుభావుడు వంటి హిట్‌ సినిమాల్లో నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement