
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. ఇందుకోసం రాజస్తాన్‌లోని జైపూర్ ప్యాలెస్ సుందరంగా ముస్తాబైంది. కాబోయే వధూవరులిద్దరూ, వారి కుటుంబాలు ప్యాలెస్‌లో పెళ్లి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అందులో భాగంగా మొదట హల్దీ ఫంక్షన్ జరిగింది.
ఈ కార్యక్రమంలో వైట్ డ్రెస్‌లో ఉన్న కొత్త పెళ్లి కొడుకు శర్వా ముఖమంతా పసుపుమయంగా మారింది. అతడు ప్రతీకారంగా అక్కడున్నవాళ్ల ముఖానికి సరదాగా పసుపు రుద్దుతూ కనిపించాడు. దీంతో వాళ్లందరూ మూకుమ్ముడిగా పసుపు చేతపట్టుకుని శర్వా వైపు వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరికాసేపట్లో మెహందీ, సంగీత్ ఫంక్షన్ జరగనున్నాయి. రేపు వేదమంత్రాల సాక్షిగా రక్షిత మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు శర్వానంద్.
శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే.. అతడు చివరగా ఒకే ఒక జీవితం చిత్రంలో నటించాడు. ప్రస్తుతం ఈ హీరో టాలెంటెడ్ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
శర్వా పెళ్లి సందడి ❤️
— SharwAnand ✨️ (@SharwaFans) June 2, 2023
Lovely & candid visuals from Hero @ImSharwanand 's Haldi 💛Ceremony in Jaipur 😍 #Sharwanand𓃵 #SharwAnand #Sharwa35 #Sharwa #haldifunction #marriage #ramcharan #prabhas #weddingvibes #Jaipur#SharwanandMarriage 🥰 ❤️ pic.twitter.com/nV0Kpbyise
Comments
Please login to add a commentAdd a comment