అగ్రహీరోల బాటలో శర్వానంద్.. అందుకేనా ఇలా..! | Hero Sharwanand Movie Selection With Directors In Tollywood | Sakshi
Sakshi News home page

ఆ విషయంలో నో కాంప్రమైజ్.. ట్రెండ్‌ ఫాలో అవుతున్న శర్వానంద్..!

Published Fri, Feb 17 2023 2:02 PM | Last Updated on Fri, Feb 17 2023 2:14 PM

Hero Sharwanand Movie Selection With Directors In Tollywood - Sakshi

ఒక దర్శకుడితో సినిమా ఎనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత ఆ దర్శకుడితో సినిమా చేయడం లేదంటారు. ఇదీ ఇప్పటి హీరోల ట్రెండ్. స్టోరీ విషయంలో కాంప్రమైజ్ కాలేక, మొహమాటాలకు పోకుండా, సినిమా ఎనౌన్స్ చేసిన తర్వాత, ఇంకా చెప్పాలంటే ఘనంగా ప్రారంభించిన తర్వాత కూడా కొన్ని ప్రాజెక్ట్స్  నిలిపేస్తున్నారు హీరోలు. తాజాగా ఈ లిస్ట్‌లో టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ చేరిపోయాడు.

ఒకే ఒక జీవితంతో మళ్లీ సక్సెస్ జీవితాన్ని ప్రారంభించాడు శర్వానంద్. ఈ దశలో హిట్ ట్రాక్‌ను కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. అందుకోసం మంచి కథలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నాడు. అందుకే కృష్ణ చైతన్య అనే దర్శకుడితో సినిమా లాక్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఘనంగా మూవీని కూడా ప్రారంభించాడు.

శ్రీరామ్ ఆదిత్యకు గ్రీన్ సిగ్నల్
అయితే ఎంతో ఘనంగా ప్రారంభించిన తర్వాత ఇప్పుడు శర్వానంద్ మనసు మారింది. కృష్ణ చైతన్య స్టోరీ విషయంలో కాన్పిడెంట్‌గా లేడు. అందుకే ప్రాజెక్ట్ ఆపేసాడని సమాచారం. శర్వానంద్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య రాసుకొచ్చిన సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. శ్రీరామ్ అంటే భలే మంచి రోజు, శమంతకమణి లాంటి చిత్రాలు తెరకెక్కించాడు.

సౌత్‌లో కొనసాగుతున్న ట్రెండ్
అయితే శర్వానంద్ ఇంత బలమైన నిర్ణయం తీసుకోవడానికి తోటీ నటీనటులు, సీనియర్ స్టార్స్ ప్రధాన కారణంగా తెలుస్తోంది. బుచ్చిబాబుతో తారక్, గౌతమ్ తిన్ననూరితో రామ్ చరణ్, సినిమాలు ఎనౌన్స్ చేసి వెనక్కి తగ్గారు. వెంకీ కుడుములతో చిరు సినిమా చేయాల్సి ఉండగా రద్దయింది. ప్రస్తుతం కోలీవుడ్‌కు కూడా ఇదే ట్రెండ్ విస్తరించింది. డాన్ దర్శకుడు సీబీతో సినిమా చేయాలనుకున్నాడు రజనీకాంత్. కానీ ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు గానీ డాన్ డైరెక్టర్‌ను కాదని జై భీమ్ మేకర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం సౌత్ మొత్తం ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. అందుకేనేమో తానెందుకు రిస్క్ తీసుకోవాలి అనుకున్నాడేమో శర్వానంద్ కూడా అదే బాటలో ప్రయాణిస్తున్నాడు. 

 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement