
హీరో శర్వానంద్‌కి జోడీగా హీరోయిన్ కృతీశెట్టి నటిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. గత సెప్టెంబరులో విడుదలైన ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’) సినిమా సక్సెస్ తర్వాత దర్శకుడు కృష్ణచైతన్యతో మూవీ చేయనున్నట్లు ప్రకటించారు శర్వానంద్. అయితే ఆ చిత్రాన్ని ప్రస్తుతం హోల్డ్‌లో ఉంచారట శర్వానంద్.
దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చెప్పిన కథ నచ్చడంతో వెంటనే సినిమాను స్టార్ట్ చేశారట. ఇందులో కృతీశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారని, ఆల్రెడీ షూటింగ్ కూడా హైదరాబాద్‌లో జరుగుతోందని టాక్. శర్వా-కృతి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై ఈ సినిమాను నిర్మిస్తున్నారని తెలిసింది.
చదవండి:
తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం
కాశ్మీర్‌లోని లింగేశ్వర ఆలయంలో త్రిష ప్రత్యేక పూజలు
Comments
Please login to add a commentAdd a comment