టప్పా టప్పా.. అంటూ పాట అందుకున్నారు శర్వానంద్, కృతీ శెట్టి. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘మనమే’ చిత్రంలో పెళ్లి సమయంలో వచ్చే ‘టప్పా టప్పా..’ అంటూ సాగే పాట విడుదల అయింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్ ఆదిత్య కీలక పాత్ర చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 7న రిలీజ్ కానుంది.
కాగా చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదల చేసిన యూనిట్ గురువారం ‘టప్పా టప్పా..’ అంటూ సాగే మూడవ పాటని విడుదల చేసింది. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను రామ్ మిరియాల, హేషమ్ అబ్దుల్ వహాబ్ పాడారు. ‘‘అందరూ ఎంజాయ్ చేసే వెడ్డింగ్ సాంగ్‌ని అందించారు హేషమ్. ఈ పాటలో శర్వానంద్, కృతీ గ్రేస్‌ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను అలరిస్తాయి’’ అని యూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment