Sharwanand Car Accident: Team Sharwanand Clarifies Minor Car Accident - Sakshi
Sakshi News home page

Sharwanand Car Accident: శర్వానంద్‌ క్షేమంగా ఉన్నారు..ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు

Published Sun, May 28 2023 11:34 AM | Last Updated on Sun, May 28 2023 11:59 AM

Sharwanand Team Responds On His Accident - Sakshi

శర్వానంద్‌ రోడ్డు ప్రమాదంపై ఆయన టీమ్‌ స్పందించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని వెల్లడించింది. ‘శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు ఫిల్మ్ నగర్‌ జంక్షన్ దగ్గర అదుపు తప్పిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అందరూ క్షేమంగా ఉన్నారు. కారుకి మాత్రం చిన్న గీతలు పడ్డాయి. చాలా స్వల్ప సంఘటన. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు’  అంటూ శర్వానంద్‌ టీమ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. 

కాగా, ఆదివారం తెల్లవారు జామున శర్వానంద్‌ ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌ జంక్షన్‌ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. రాంగ్‌ రూట్‌లో వస్తున్న బైక్‌ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో శర్వాకు స్పల్ప గాయాలు అయినట్లు తొలుత ప్రచారం జరిగింది. ఆయనను ఆస్పతికి తరలించినట్లు కూడా వార్తలు వినిపించాయి. కానీ అది అవాస్తవం అని, శర్వానంద్‌ క్షేమంగా ఉన్నారని ఆయన టీమ్‌ వెల్లడించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement