Sharwanand completes 20 years in TFI; pens an emotional note - Sakshi
Sakshi News home page

Sharwanand: నా ఈ ఒకే ఒక జీవితం సినిమాకే అంకితం: శర్వానంద్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Published Mon, Mar 6 2023 2:18 PM | Last Updated on Mon, Mar 6 2023 3:27 PM

Sharwanand Completes 20 Years in Cinema, Shares Post - Sakshi

'అయిదో తారీఖు'తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్‌ హీరో శర్వానంద్‌. ఈ సినిమా ఎలా వచ్చిందో అలానే పోయింది. కానీ తర్వాత నటించిన యువసేనతో మంచి పేరొచ్చింది. సంక్రాంతి, లక్ష్మి సినిమాల్లో వెంకటేశ్‌ తమ్ముడిగా చేసి మరింత మందికి దగ్గరయ్యాడు. అమ్మ చెప్పిందిలో నటనతో అదరగొట్టేశాడు. గమ్యంతో నటజీవితమే మారిపోయింది. రన్‌ రాజా రన్‌తో స్టార్‌ ఎదిగాడు. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, శతమానం భవతితో మంచి మార్కులు కొట్టేశాడు. శర్వానంద్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేశాడీ హీరో.

'20 ఏళ్లుగా ఎన్నో పాత్రలు చేస్తూ, వెండితెరపై అందరినీ అలరిస్తున్నాను. భావోద్వేగాలతో నిండిన ఈ ప్రయాణంలో 20 సంవత్సరాల స్నేహం, కష్టాలు, ఎత్తులు, లోతులు, చిరునవ్వులు ఎన్నో మరెన్నో.. అచంచలమైన ప్రేమ, మద్దతుతో నా ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. ఈ 20 సంవత్సరాలు నా జీవితాన్ని, నా వ్యక్తిత్వాన్ని అద్భుతంగా మలిచాయి' అని రాసుకొచ్చాడు.

నా ఈ ఒకే ఒక జీవితం సినిమాకు అంకితం. 20 సంవత్సరాల క్రితం శ్రీకారం చుట్టిన ఈ సినీ ప్రస్థానం మరుపురానిది, మరువలేనిది. ఈ సినీలోకంలో నా గమ్యం ఎంతో దూరం. మిమ్మల్ని అలరించడం కోసం ప్రతి క్షణం రన్‌ రాజా రన్‌లా పరుగులు తీస్తూనే ఉంటాను. కృషి చేస్తూనే ఉంటాను. శతమానం భవతి అంటూ మీరు నాకిచ్చే ఆశీస్సులతో సాధ్యమవుతుందని నేను నమ్ముతున్నాను. మీ శర్వానంద్‌..' అని రాసుకొచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement