పల్లెకు పోదాం అంటున్నారు హీరో శర్వానంద్. సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా గ్రామీణ నేపథ్యంలో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రం అధికారిక ప్రకటన గురువారం వెలువడింది. ‘‘ఉత్తర తెలంగాణ, తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ్రపాంతాల నేపథ్యంలో 1960 కాలంలో జరిగే గ్రామీణ చిత్రం ఇది.
ఎమోషన్, యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ మూవీ కోసం ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను రెడీ చేశారు సంపత్ నంది. మునుపెన్నడూ చూడని ఓ కొత్త పాత్రలో శర్వానంద్ కనిపిస్తారు. 1960 నాటి క్యారెక్టర్‌లో కనిపించేందుకు శర్వానంద్ మేకోవర్ అయ్యారు.
యూనివర్సల్ అప్పీల్ ఉన్న సబ్జెక్ట్ ఇది. దీంతో ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నాం’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ఎస్. సౌందర్ రాజన్.
Comments
Please login to add a commentAdd a comment