Sharwanand To Spend Whopping Amount For Wedding At Leela Palace - Sakshi
Sakshi News home page

Sharwanand: శర్వానంద్‌ పెళ్లి.. ఒక్కరోజు కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా?

Published Sun, May 21 2023 5:11 PM | Last Updated on Sun, May 21 2023 6:06 PM

Sharwanand Spent Whopping Amount For Wedding In Leela Palace - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌ బ్యాచిలర్‌ లైఫ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయ్యాడు. విదేశాల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్న రక్షితా రెడ్డితో తన జీవితాన్ని పంచుకోనున్నాడు. ఇప్పటికే వీరి నిశ్చితార్థం జరిగిపోగా జూన్‌ 2,3 తేదీల్లో పెళ్లి జరగనుంది. రెండో తారీఖున మెహందీ, సంగీత్‌ ఫంక్షన్‌ నిర్వహించనుండగా మూడో తారీఖున రక్షిత మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు శర్వానంద్‌. 

రాజస్థాన్‌లోని లీలా ప్యాలెస్‌ వీరి వివాహానికి వేదికగా మారనున్న సంగతి తెలిసిందే! అయితే లీలా ప్యాలెస్‌లో పెళ్లి అనేది ఖర్చుతో కూడుకున్న విషయమని తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం లీలా ప్యాలెస్‌లో ఒక్క రోజుకే రూ.4 కోట్లు ఖర్చు అవుతుందట. ఈ విషయం తెలిసిన శర్వా ఫ్యాన్స్‌ జీవితంలో ఒక్కసారే వచ్చే పెళ్లికి ఆ మాత్రం ఖర్చుపెట్టకపోతే ఎలా అని అంటున్నారు. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ పెళ్లికి సినీప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నేతలు సైతం అతిథులుగా విచ్చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే శర్వానంద్‌ చివరగా ఒకే ఒక జీవితం సినిమాలో నటించాడు. ప్రస్తుతం అతడు టాలెంటెడ్‌ దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మలయాళ కంపోజర్‌ హృదయం ఫేమ్‌ హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ సంగీతం అందిస్తున్నాడు.

చదవండి: చిత్రపరిశ్రమలో విషాదం.. యాక్సిడెంట్‌లో బుల్లితెర నటి మృతి
కన్నీళ్లు పెట్టిస్తున్న జబర్దస్త్‌ యాంకర్‌ సౌమ్య రావు వీడియో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement