
యంగ్ హీరో శర్వానంద్, రీతూ వర్మ జంటగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఎస్‌ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో (తమిళంలో ‘కణం’ పేరుతో) సెప్టెంబర్ 9న విడుదలవుతోంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘మారిపోయే..’ అంటూ సాగే ప్రమోషనల్ సాంగ్‌ని విడుదల చేశారు. ఈ పాటని హీరో కార్తీ పాడటం విశేషం.
చదవండి: నా బిడ్డకు అలాంటి జీవితం ఇవ్వాలనుకుంటున్నా: సోనమ్ కపూర్
అది మాత్రమే కాదు.. ఈ పాటలో ఆయన స్పెషల్‌గా కనిపించడం మరో ప్రత్యేకత. ‘‘విభిన్నమైన కథాంశంతో రపొందిన చిత్రమిది. శర్వానంద్ కెరీర్‌లో 30వ చిత్రంగా వస్తున్న చిత్రమిది. ఇందులోని ప్రమోషనల్ సాంగ్ ‘మారిపోయే..’ పాటకు కృష్ణచైతన్య సాహిత్యం అందించగా, కార్తీ ఎనర్జిటిక్‌గా పాడారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. అమల అక్కినేని, నాజరల్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో ‘వెన్నెల’ కిషోర్, ప్రియదర్శి తదితరులు నటించారు.
Comments
Please login to add a commentAdd a comment