నిశ్చితార్థం రద్దు చేసుకున్న శర్వానంద్‌? ఇదిగో క్లారిటీ! | Is Sharwanand Wedding with Rakshita Reddy Called off? Here is the Clarity | Sakshi
Sakshi News home page

Sharwanand: శర్వానంద్‌ పెళ్లి ఆగిపోయిందా? అసలు విషయమిదే!

May 14 2023 8:45 PM | Updated on May 15 2023 7:40 AM

Is Sharwanand Wedding with Rakshita Reddy Called off? Here is the Clarity - Sakshi

శర్వానంద్‌- రక్షితల పెళ్లి ఆగిపోలేదు. వాళ్లిద్దరూ సంతోషంగానే ఉన్నారు. శర్వానంద్‌ ప్రస్తుతం శ్రీరామ్‌ ఆదిత్య డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్‌లో బిజీ ఉన్నాడు. ఇటీవలే లండన్‌లో 40 రోజుల షెడ్యూల్‌ పూర్తి చేసుకుని ఇండియాకు..

యంగ్‌ హీరో శర్వానంద్‌ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే! అందులో భాగంగానే ఈ ఏడాది ప్రారంభంలో శర్వానంద్‌కు యూఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్న రక్షితారెడ్డితో నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్‌కు రామ్‌చరణ్‌, ఉపాసన, సిద్దార్థ్‌, అదితిరావు హైదరీ వంటి పలువురు సెలబ్రిటీలు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.

ఇకపోతే వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగి దాదాపు ఐదు నెలలు కావాల్సి వస్తోంది. ఇంతవరకు వీరు పెళ్లి ఊసెత్తకపోవడంతో ఈ ఎంగేజ్‌మెంట్‌ బ్రేక్‌ అయిందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై శర్వానంద్‌ టీమ్‌ క్లారిటీ ఇచ్చింది. 'శర్వానంద్‌- రక్షితల పెళ్లి ఆగిపోలేదు. వాళ్లిద్దరూ సంతోషంగా ఉన్నారు. శర్వానంద్‌ ప్రస్తుతం శ్రీరామ్‌ ఆదిత్య డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇటీవలే లండన్‌లో 40 రోజుల షెడ్యూల్‌ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చాడు.

తను ఒప్పుకున్న ప్రాజెక్టులను పూర్తి చేశాకే పెళ్లిపై పూర్తి స్థాయిలో ఫోకస్‌ చేస్తాడు. ఇప్పుడతడు సిటీలోనే ఉన్నాడు కాబట్టి ఇరు కుటుంబాలు కలుసుకుని పెళ్లికి మంచి ముహూర్తం ఫిక్స్‌ చేస్తారు. ఆ పెళ్లి తేదీని కూడా అధికారికంగా ప్రకటిస్తాం' అని హీరో టీమ్‌ స్పష్టతనిచ్చింది. కాగా శర్వానంద్‌ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రక్షిత తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్‌ రెడ్డి కుమార్తె. అంతేకాకుండా ఆమె ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనుమరాలని తెలుస్తోంది.

చదవండి: ప్రపంచంలో బెస్ట్‌ మదర్‌ నువ్వే.. నయన్‌కు విఘ్నేశ్‌ విషెస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement