Actor Sharwanand Marriage Date And Venue Fixed, Check Deets Inside - Sakshi
Sakshi News home page

Sharwanand Marriage Date And Place: శర్వానంద్‌ పెళ్లి డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడు, ఎక్కడంటే..

Published Wed, May 17 2023 12:51 PM | Last Updated on Wed, May 17 2023 1:02 PM

Sharwanand Marriage Date Fix - Sakshi

యంగ్‌ హీరో శర్వానంద్‌ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలోనే యూఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్న రక్షితారెడ్డితో శర్వా ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఈ వేడుకకి రామ్‌ చరణ్‌తో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు. నిశ్చితార్థం జరిగిన ఐదు నెలల తర్వాత పెళ్లి డేట్‌ ఫిక్స్‌ చేసుకుంది ఈ జంట. వచ్చే నెలలో వీరి వివాహం జరగనుంది.

జూన్‌ 2,3 తేదిలలో శర్వా- రక్షితల వివాహం గ్రాండ్‌గా చేయబోతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరి వివాహ వేడుకకి రాజస్తాన్‌లోని లీలా ప్యాలెస్ వేదిక కానుంది. జూన్‌ 2న మెహందీ ఫంక్షన్‌తో పాటు సాయంత్రం సంగీత్‌ నిర్వహించనున్నారు.

ఇక జూన్‌ 3న రక్షిత మెడలో శర్వా మూడు ముళ్లు వేయనున్నాడు. ఈ పెళ్లికి సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించారట. టాలీవుడ్‌కి చెందిన స్టార్‌ హీరో హీరోయిన్లు పెళ్లి వేడుకలో పాల్గొని సందడి చేయనున్నారు.
చదవండి:
బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ?

కీర్తి సురేశ్ కాబోయే భర్త ఎవరో తెలుసా?.. వైరలవుతున్న ఫోటో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement