Ram Charan Attends For Sharwanand And Rakshita Reddy Sangeet, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Ram Charan: శర్వానంద్ పెళ్లి వేడుకల్లో రామ్ చరణ్ సందడి.. ఫోటోలు వైరల్

Published Sat, Jun 3 2023 11:42 AM | Last Updated on Sat, Jun 3 2023 4:59 PM

Sharwanand-Rakshita Reddy Sangeet Ram Charan attends Goes Viral - Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌, రక్షితా రెడ్డిల పెళ్లి వేడుక ఘనంగా జరుగుతోంది. రాజస్థాన్‌లో జైపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటి కానుంది. వీరి పెళ్లి వేడుకలకు  లీలా ప్యాలెస్‌ను అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. అంతకుముందే కాబోయే వధూవరులిద్దరి కుటుంబాలు పెళ్లి సంబరాల్లో మునిగి తేలారు.

(ఇది చదవండి: ‘మేమ్ ఫేమస్' నటుడిగా మంచి గుర్తింపుని ఇచ్చింది: కిరణ్‌ మచ్చ)

శుక్రవారం రాత్రి జరిగిన హల్దీ, సంగీత్‌ వేడుకల్లో పలువురు తారలు కూడా పాల్గొన్నారు. శర్వానంద్ క్లోజ్ ఫ్రెండ్‌ రామ్ చరణ్ కూడా సంగీత్‌కు హాజరైన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. జైపూర్‌లో జరుగుతున్న ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు శర్వానంద్ స్నేహితులు రామ్ చరణ్, అఖిల్ అక్కినేని, రానా దగ్గుబాటితో పాటు పలువురు తారలు హాజరైనట్లు తెలుస్తోంది.

కాగా.. శర్వానంద్‌ సినిమాల విషయానికి వస్తే.. అతడు చివరగా ఒకే ఒక జీవితం చిత్రంలో నటించాడు. ప్రస్తుతం ఈ హీరో టాలెంటెడ్‌ దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తుండగా హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ సంగీతం అందిస్తున్నాడు.

(ఇది చదవండి: శర్వానంద్‌ పెళ్లి సందడి షురూ.. హల్దీ వేడుక వీడియో వైరల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement