
బనశంకరి(కర్ణాటక): బందిపోటు ముఠా దండుపాళ్యం గ్యాంగ్ నేరాలు రుజువు కావడంతో ఐదుమందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ పరప్పన అగ్రహార ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. వివరాలు... 2000 సంవత్సరంలో నగరంలోని అగ్రహారదాసరహళ్లిలో దొడ్డహనుమ, మునికృష్ణ, లక్ష్మీ, నల్లతిమ్మ, వెంకటేశ్ అనే ఐదుమంది దండుపాళ్య గ్యాంగ్ సభ్యులు గీతా అనే మహిళ ఇంట్లోకి వెళ్లి మంచినీళ్లు కావాలని అడుగుతూ చాకుతో ఆమె గొంతు కోసి చంపారు. బంగారు నగలు, చీరలు దోచుకెళ్లారు.
ఈ ఘటనపై దండుపాళ్య గ్యాంగ్ పై కామాక్షీపాళ్య పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా పోలీసులు నిందితులను అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని జైలుకు తరలించారు. ఈ కేసుపై పరప్పన అగ్రహార ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. గత 17 ఏళ్లుగా సుదీర్ఘ విచారణ చేపట్టిన కోర్టు దండుపాళ్యం గ్యాంగ్ చేసిన హత్య రుజువు కావడంతో న్యాయమూర్తి శివనగౌడ ఐదుగురికీ జీవితఖైదుతో పాటు తలా రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment