
సాక్షి, అనంతపురం: దండుపాళ్యం సినిమా స్ఫూర్తితో ఓ తీవ్రమైన నేరానికి పాల్పడిన నిందితున్ని పోలీసులు పట్టుకున్నారు. గత ఏడాది నవంబర్ లో అనంతపురం జిల్లా కదిరిలో టీచర్ ఉషారాణి హత్య జరిగింది. సుమారు ఐదు వేల మందిని విచారించిన పోలీసులు.. కదిరికి చెందిన షఫీవుల్లాను నిందితుడిగా తేల్చారు. దండుపాళ్యం సినిమా చూసి షఫీ ఇంతటి ఘెరానికి పాల్పడినట్లు అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప పేర్కొన్నారు. కేసు వివరాలను వెల్లడించిన ఎస్పీ ఫక్కీరప్ప దండుపాళ్యం చిత్రయూనిట్ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
(చదవండి: చుక్క గొరక.. సాగు ఎంచక్కా!)
నిందితుడి కోసం ఐదు రాష్ట్రాల్లో గాలింపు
నిందితుడు షఫీవుల్లా నుంచి పోలీసులు 58 తులాల బంగారం, 97 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది నవంబర్ 11న కదిరి ఎన్జీవో కాలనీలో జరిగిన టీచర్ ఉషారాణి దారుణ హత్య జరిగిన సంగతి తెలిసిందే. నిందితుడి కోసం ఐదు రాష్ట్రాల్లో 8 ప్రత్యేక బృందాలు గాలించాయి. కేసును ఛేదించేందుకు పోలీసులు లక్ష ఫోన్ కాల్స్ పరిశీలించారు. ఐదు వేల మంది అనుమానితుల విచారించారు. ఈమేరకు అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప మీడియా కు వివరాలు వెల్లడించారు.
(చదవండి: అలలు చెక్కిన శిల్పాలు)
Comments
Please login to add a commentAdd a comment