ఆగస్ట్ 15న దండుపాళ్యం 4 | Dandupalyam 4 Telugu Movie Set For August 15 Release | Sakshi
Sakshi News home page

ఆగస్ట్ 15న దండుపాళ్యం 4

Published Mon, Jul 22 2019 3:44 PM | Last Updated on Mon, Jul 22 2019 5:08 PM

Dandupalyam 4 Telugu Movie Set For August 15 Release - Sakshi

బెనర్జీ, వెంకట్‌, ముమైతఖాన్‌, సంజీవ్‌కుమార్‌, సుమన్‌ రంగనాథన్‌ కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్‌ దర్శకత్వం తెరకెక్కిన సినిమా ‘దండుపాళ్యం 4’. ఈ సినిమాకు వెంకట్‌ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఎన్ని అవాంతరాలు వచ్చినా ఖచ్చితంగా ఆగస్ట్‌ 15 విడుదల చేస్తామని చిత్ర దర్శకనిర్మాతలు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ చిత్రం ‘దండుపాళ్యం’ ట్రయాలజీకి సీక్వల్‌ కాదని చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఈ సినిమాలో జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ రూపొందిందని తెలిపారు.

ఈ సందర్బంగా నిర్మాత వెంకట్ మాట్లాడుతూ.. ‘ఎన్ని అవాంతరాలు ఎదురైనా మా సినిమాను ఖచ్చితంగా ఆగస్ట్ 15న విడుదల చెయ్యబోతున్నాము. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాల్లో ఉందీ సినిమా.  అనేక ఆసక్తికరమైన అంశాలతో ఈ ‘దండుపాళ్యం 4’ ఉండబోతోంది. ఇందులో ఏడుమంది ఉన్న గ్యాంగ్‌కు నాయకురాలిగా సుమా రంగనాథన్ చక్కగా నటించారు. కె.టి.నాయక్‌ సినిమాను బాగా డైరెక్ట్ చేశాడు’ అన్నారు. అనంతరం దర్శకుడు కె.టి.నాయక్ మాట్లాడుతూ.. ‘దండుపాళ్యం1,2 పార్ట్స్ కు ఈ సినిమా ఎలాంటి సంబంధం లేదు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. ఆగస్ట్ 15న ఈ సినిమాను విడుదల చేస్తున్నాము. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందని ఆశిస్తున్నాను. బెనర్జీ, వెంకట్‌, ముమైత్‌ఖాన్‌, సంజీవ్‌కుమార్‌, సుమన్‌ రంగనాథన్‌ పాత్రకు సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయి’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement