Allu Arjun Pushpa Movie Twitter Review In Telugu - Sakshi
Sakshi News home page

PushpaTwitter Review : ‘పుష్ప’ మూవీ ఎలా ఉందంటే..

Dec 17 2021 7:53 AM | Updated on Dec 20 2021 11:34 AM

Pushpa Movie Twitter Review In Telugu - Sakshi

Pushpa Movie Review In Telugu: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.‘ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం హ్యాట్రిక్‌ చిత్రం ఇది .రష్మిక మందాన్నా హీరోయిన్‌ నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీగానే అంచనాలున్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాలోని మొదటి పార్ట్‌ ‘పుష్ప - ది రైజ్‌’ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పటికే ఓవర్సీస్‌, తెలంగాణతో సహా పలు ప్రాంతాల్లో రిలీజైంది. టైటిల్‌ అనౌన్స్‌ చేసినప్పటి నుంచి పుష్పపై అంచనాలు పెరిగాయి. అల్లు అర్జున్‌ తొలిసారి పాన్‌ ఇండియా చిత్రం చేయడం.. దాన్ని సుకుమార్ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించటంతో సూపర్ బజ్ క్రియేట్ అయ్యింది. తానికి తోడు ప్రమోషన్స్‌ని అల్లు అర్జున్‌ దగ్గర ఉండి చూసుకోవడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  ఇక పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్‌లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


ఈ సినిమాకు అల్లు అర్జున్‌ నటనే హైలెట్‌ అని చెబుతున్నారు. వన్‌మ్యాన్‌ షో చేశాడని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. అలాగే యాక్షన్‌ సీన్స్‌ అదిరిపోయాయి అంటున్నారు. 

బన్నీ తప్ప ఎవరూ కనిపించలేదని ఇంకొకరు ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ చాలా బావుందని... చిత్తూరు యాసలో చిట్టకొడుతున్నాడని ఒకరు పేర్కొన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement