టైటిల్ : జీఎస్‌టీ(గాడ్, సైతాన్, టెక్నాలజీ)
నటీనటులు : ఆనంద్ కృష్ణ, అశోక్, వెంకట్, నందు, స్వాతిమండల్, యాంకర్ ఇందు, పూజా సుహాసిని, జూనియర్ సంపు తదితరులు
నిర్మాణ సంస్థ : తోలు బొమ్మల సిత్రాలు
నిర్మాతలు : కొమారి జానయ్య నాయుడు
దర్శకుడు: కొమారి జానకి రామ్
తోలు బొమ్మల సిత్రాలు" బ్యానర్ పై కొమారి జానకి రామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్న చిత్రం‘జీఎస్‌టీ’. గాడ్ (దేవుడు)... సైతాన్ (దెయ్యం)... టెక్నాలజీ (సాంకేతికత) అనేది ఉపశీర్షిక. ఆనంద్ కృష్ణ, అశోక్, వెంకట్, నందు, స్వాతిమండల్, యాంకర్ ఇందు, పూజా సుహాసిని, జూనియర్ సంపు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. వినాయక చవితి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం
కథేటంటే..
చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువకుల గ్యాంగ్ లాంగ్ టూర్ ప్లాన్ చేస్తారు. కట్ చేస్తే.. నేవి ఉద్యోగం చేస్తున్న ఒకతను ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఎలాగైనా డబ్బులు సంపాదించి లైఫ్ సెటిల్ చేసుకోవాలి అని అనుకుంటారు. ఒక రోజు ఈ ప్రేమ జంట సముద్రపు ఒడ్డున ఏకాంతంగా గడుపుతున్న సమయంలో అక్కడ చేపలు పడుతున్న జాలర్లు కి సముద్రం లో తిమింగలం స్పర్మ్ నుంచి విడుదల అయినా అతి విలువైన వస్తువు దొరుకుతుంది. ఆ వస్తువు మనం బయట వాడే పెర్ఫ్యూమ్ ల లో వాడతారు. అది చూసిన నేవి ఉద్యోగి.. జాలర్లను హతమార్చి దాన్ని తీసుకువెళ్దాం అని ప్లాన్ చేస్తాడు. చివరికి ఆ విలువైన వస్తువు వాళ్ళకి దొరికిందా లేదా? వీరి మధ్యలో దెయ్యం ఎందుకు ఎంటర్ అయ్యింది? టూర్ ప్లాన్ చేసుకున్న కాలేజీ యువతకి, నేవి ఉద్యోగికి మధ్య సంబంధం ఏంటి? అసలు దెయ్యాలు ఉన్నాయా? దేవుడు-దెయ్యాలు నిజమా? సైన్స్ నిజమా? తెలుసుకోవాలంటే థియేటర్స్‌కి వెళ్లి జీఎస్‌టీ సినిమా చూడాల్సిందే.
నటీ నటులు
కాలేజీ యువతగా నటించనవారంతా కొత్త వాళ్ళు.అయినా చాలా చక్కగా నటించారు. ఫస్ట్ హాఫ్ అంత చాలా ఆహ్లాదకరంగా సినిమాని వాళ్ళ భుజాలు మీద సినిమాని నడిపించారు అని చెప్పవచ్చు.నేవీ ఆఫీసర్ గా అతని లవర్ వాళ్ళ ఇద్దరు మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. నంద్ కృష్ణ, అశోక్, వెంకట్, నందు, స్వాతిమండల్, యాంకర్ ఇందు తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు.
ఎలా ఉందంటే..
సమాజంలో దేవుడు, దెయ్యం,సైన్స్ పైన చాలా అనుమానాలు, అపోహలున్నాయి. వాటిని నిగ్గు తేల్చే కథనంతో వచ్చిన సినిమానే జీఎస్‌టీ.డైరెక్టర్ జానకి రామ్ ఒక అద్భుతమైన పాయింట్ ని తీసుకొని సినిమాని తెరకెక్కించారు. అయితే ఆయన ఎంచుకున్న పాయింట్‌ని తెరపై చూపించడంలో కాస్త విఫలమయ్యాడు. ఫస్టాఫ్‌లో కొన్ని సాగదీత సీన్స్ ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తాయి. దెయ్యం ఎంటర్ అయినప్పటి నుంచి కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వెల్ సీన్ మాత్రం సినిమాపై ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. యు.వి నిరంజన్ సంగీతం బాగుంది. డి యాదగిరి సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాన విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment