Kotta Kottaga Movie Review In Telugu - Sakshi
Sakshi News home page

Kotha Kothaga Review: ‘కొత్త కొత్తగా’ మూవీ రివ్యూ

Published Fri, Sep 9 2022 7:01 PM | Last Updated on Fri, Sep 9 2022 8:16 PM

kotta Kottaga Movie Review In Telugu - Sakshi

టైటిల్: కొత్త కొత్తగా
నటీనటులు:  అజయ్ , వీర్తి వఘాని, ఆనంద్‌, కాశీ విశ్వనాధ్ ,తులసి, కల్యాణి నటరాజన్, పవన్ తేజ్, ఈరోజుల్లో సాయి త‌దిత‌రులు
నిర్మాణ సంస్థ: ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: మురళీధర్ రెడ్డి ముక్కర
దర్శకత్వం: హనుమాన్ వాసంశెట్టి
సంగీతం: శేఖర్‌ చంద్ర
సినిమాటోగ్రఫీ: వెంకట్‌
ఎడిటర్‌: ప్రవీణ్‌ పూడి
విడుదల తేది: సెప్టెంబర్‌ 9,2022 

అజయ్, వీర్తి వఘాని జంటగా హనుమాన్‌ వాసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొత్త కొత్తగా’. బీజీ గోవింద రాజు సమర్పణలో మురళీధర్‌ రెడ్డి ముక్కర నిర్మించిన ఈ సినిమా నేడు(సెప్టెంబర్‌ 9)  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

‘కొత్త కొత్తగా’ కథేంటంటే..
రాజీ (వీర్తి వఘాని),  సిద్దు (అజయ్) ఇద్దరూ ఒకే కాలేజీకి చెందిన ఇంజనీరింగ్‌ స్టూడెంట్స్‌. అబ్బాయికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడానికి ఇష్టపడని రాజీ ని చూడగానే సిద్దు ఇష్టపడతాడు. మరో వైపు రాజీ అన్న కేశవ్ తన చెల్లికి దగ్గరి సంబంధం కాకుండా దూరం సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటాడు.అయితే కేశవ్ బామ్మర్ది రామ్ (పవన్ తేజ్) తన అక్క సత్య (లావణ్య రెడ్డి) తో రాజీ అంటే చాలా ఇష్టం తనని పెళ్లి చేసుకొంటాను అంటాడు. రామ్ తల్లి తండ్రులు రాజీవ్ ఫ్యామిలీ తో మాట్లాడడంతో మొదట కేశవ్ కు ఇష్టం లేకపోయినా చివరికి ఒకే అనడంతో రామ్ తో  రాజీకి పెళ్లి ఫిక్స్ చేస్తారు. కానీ రాజీకి మాత్రం ఈ పెళ్లి ఇష్టం ఉండదు. ఇంకా చదువుకోవాలని అనుకుంటుంది. అదే సమయంలో తనను సిద్దు ప్రాణంగా ప్రేమిస్తున్నాడని తెలుసుకొని అతన్ని ఇష్టపడుతుంది. మరి రాజీ చివరకు ఎవరిని పెళ్లి చేసుకుంది? తల్లిదండ్రుల కోసం రామ్‌తో పెళ్లికి సిద్దమైందా? లేదా ప్రేమించిన సిద్దుతోనే జీవితాన్ని పంచుకుందా? తన ప్రేమను దక్కించుకోవడం కోసం సిద్దు ఎలాంటి త్యాగం చేశాడు? అనేదే మితతా కథ.  

 ఎలా ఉందంటే..
 నేటి తరాన్ని దృష్టిలో పెట్టుకొని ‘కొత్త కొత్తగా’ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు హనుమాన్‌ వాసంశెట్టి. ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ  ఆడియన్స్‌కు ఇబ్బంది కలగకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందనే  అనే క్యూరియాసిటీ ప్రేక్షకులకు కలిగిస్తుంది. ఫస్టాఫ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే లవ్‌ సీన్స్‌ ఆకట్టుకున్నప్పటీకీ.. కొన్ని సాగదీత సీన్స్‌ పంటికింద రాయిలా ఉంటాయి. ఒకటి రెండు కామెడీ సీన్స్‌ బాగుంటాయి. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఇక నటీనటుల విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరోగా నటించిన అజయ్‌కి ఇది తొలి సినిమా. అయినప్పటికీ సిద్దు పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. 

 ఒక పెద్దింటి పల్లెటూరు అమ్మాయి రాజీ  గా వీర్తి వఘాని  అద్భుతమైన నటనను ప్రదర్శించింది.రొమాన్స్ లోను, ప్రేమలోనూ  తను అన్ని బావోధ్వేగాలను చాలా బాగా వ్యక్త పరచింది. రాజీ అన్నగా కేశవ్ (అనిరుద్ ) రఫ్ క్యారెక్టర్ లో ఒదిగిపపోయాడు ,రాజీ బావగా రామ్ (పవన్ తేజ్), రాజీ కి వదినగా సత్య (లావణ్య రెడ్డి) లు చక్కటి నటనను  ప్రదర్శించారు. బస్ స్టాప్,ఈ రోజుల్లో ఫెమ్ సాయి హీరో ఫ్రండ్ క్యారెక్టర్ లో చాలా బాగా నటించాడు. అలాగే వాసు  మంచి రోల్ చేశాడు.. ఇంకా ఈ సినిమాలో నటించిన వారంతా వారికీచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.

ఇక సాంకేతిక విషయానికొస్తే.. శేఖర్ చంద్ర  సంగీతం పర్వాలేదు. ఒకటి రెండు పాటలు బాగున్నాయి.  సిద్ శ్రీరామ్ పాడిన  ప్రియతమా పాట చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. వెంకట్‌ సినిమాటోగ్రాఫర్‌ వెంకటర్‌ మంచి విజువల్స్‌ ఇచ్చాడు. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement