
సాక్షి, హైదరాబాద్: సాక్షి డిజిటల్ మీడియాపై కొందరు దుండగులు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. మార్ఫింగ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. గత జనవరిలో ఒక ప్రముఖ న్యూస్‌చానల్ వెబ్‌సైట్‌లో వచ్చిన వార్తలోని ఫొటోను మార్ఫింగ్ చేసి వాట్సప్,ఫేస్‌బుక్, ట్విటర్‌లో పెట్టారు.
దీనిపై సాక్షి మీడియా గ్రూపు సైబర్ క్రైమ్ పోలీసు విభాగానికి ఫిర్యాదు చేసింది. మార్ఫింగ్ చేసిన ఫొటోలతో తమ సంస్థపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. కాగా, ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మొద్దని పాఠకులకు సాక్షి మీడియా గ్రూపు విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment