సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు(టెస్కాబ్)కు జాతీయ అవార్డు దక్కింది. వ్యవసాయ రంగానికి ఆరి్థకదన్నుగా నిలవడం, రైతాంగానికి వేగంగా రుణాలు మంజూరు చేయడంతో ఈ అవార్డు వరించింది. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(నాబార్డు) జాతీయస్థాయిలో వ్యవసాయ రంగానికి అత్యుత్తమ సేవలందించిన బ్యాంకులకు అవార్డులివ్వడం తెలిసిందే. జిల్లా బ్యాంకు కేటగిరీలో దక్షిణ భారతదేశం నుంచి కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకును ఉత్తమ పురస్కారానికి ఎంపిక చేసింది. నాబార్డు వార్షిక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ముంబైలోని నాబార్డ్ కేంద్ర కార్యాలయం నుంచి వర్చువల్ పద్ధతిలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డుల ప్రదానం జరిగింది.
ఈ అవార్డును అందుకున్న టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు మాట్లాడుతూ, ఒకే రాష్ట్రం నుంచి రెండు జాతీయ అవార్డులను ఒకే సంవత్సరంలో కైవసం చేసుకోవ డం చాలా అరుదైన విషయమని, ఈ రెండు బ్యాం కులకు తనే అధ్యక్షుడిగా ప్రాతినిథ్యం వహించడం గర్వంగా ఉందన్నారు. ఈ ఘనత సాధించినందుకు గాను టెస్కాబ్ ఎండీ డా.నేతి మురళీధర్, సిబ్బందిని ఆయన అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment