
‘‘నా కెరీర్‌లో నేషనల్ అవార్డు రాకపోవడమే అసంతృప్తి’ అని ఓ సందర్భంలో షారుక్ పేర్కొన్నారు. తాజాగా ఈ కామెంట్ మీద ఓ ఈవెంట్‌లో మాట్లాడారాయన. ‘‘అప్పుడు నేను ఇచ్చిన స్టేట్‌మెంట్ కేవలం జోక్ మాత్రమే. నేషనల్ అవార్డ్ రాలేదని నాకు ఎటువంటి విచారం లేదు. ఒకవేళ అవార్డు రాకపోతే అది కోల్పోయానని అనుకునే మనస్తత్వం కాదు నాది.
అలాగే ఆర్టిస్టిక్ స్పేస్‌ని ఎక్కువ శాతం వినియోగించలేదని అనుకుంటున్నాను. నేను చేసిన వాటిలో ఎక్కువ శాతం కమర్షియల్ చిత్రాలే ఉన్నాయి. అయినప్పటికీ అందులో ఆర్ట్‌ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాను’’ అని పేర్కొన్నారు. మరి నేషనల్ అవార్డ్ రాకపోవడం వెలితిగా ఉందా అని మళ్లీ అడగ్గా – ‘‘ఒక నేషనల్ అవార్డు, ఓ ఆస్కార్ సాధిస్తే నా అవార్డుల కలెక్షన్స్ పూర్తవుతుంది’’ అని పేర్కొన్నారు షారుక్.
Comments
Please login to add a commentAdd a comment