సాక్షి, తాడేపల్లి: డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంట బీమా పథకానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అవార్డు గెలుచుకోవడంపై వ్యవసాయ అధికారులను సీఎం జగన్ అభినందించారు. ఇటీవల రాయ్‌పూర్‌లో జరిగిన పీఎంఎఫ్‌బీవై జాతీయ సదస్సులో ఇన్నోవేషన్ కేటగిరీలో ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్‌కు కేంద్ర వ్యవసాయ కార్యదర్శి మనోజ్ అహుజా అందజేశారు.
ఈరోజు(శుక్రవారం) వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ స్పెషల్ కమిషనర్ సి.హరికిరణ్‌లు సీఎం జగన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసి భారత ప్రభుత్వం అందజేసిన జ్ఞాపికను చూపించారు. దీనిలో భాగంగా అధికారులను అభినందించిన సీఎం జగన్.. భవిష్యత్తులో మరింత సమర్ధవంతంగా పని చేయాలని, దిగుబడులు అంచనాలలో టెక్నాలజీ వినియోగం పెంచాలని దిశానిర్దేశం చేశారు. కాగా, సాగుచేసిన ప్రతి ఎకరా పంట వివరాలను అత్యంత పారదర్శకంగా ఈ–క్రాప్ ద్వారా నమోదు చేయడం, తద్వారా ఉచిత పంటల బీమా పథకాన్ని కేవలం ఈ–క్రాప్ నమోదు ఆధారంగా అమలుచేయడం ద్వారా యూనివర్శల్ కవరేజిని సాధించిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment