
బాల నటుడి కల నెరవేర్చిన ఇళయదళపతి
మనసులో కోరిక నెరవేరితే ఆ ఆనందమే వేరు. దానికి వెల కట్టలేము కూడా. బాల నటుడు ఆధీష్ ప్రవీణ్ అంతే ఆనందాన్ని
మనసులో కోరిక నెరవేరితే ఆ ఆనందమే వేరు. దానికి వెల కట్టలేము కూడా. బాల నటుడు ఆధీష్ ప్రవీణ్ అంతే ఆనందాన్ని అనుభిస్తున్నాడు. మలయాళ చిత్రంలో నటనకుగానూ ఈ కేరళా బుడతడికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా ఆధీష్ ప్రవీణ్ పత్రికల వారికిచ్చిన భేటీలో ఈ జాతీయ అవార్డును అందుకోవడం కంటే తన అభిమాన నటుడు విజయ్‌ను కలుసుకోవడమే తన జీవిత లక్ష్యం అని పేర్కొన్నారు.
ఈ విషయం నటుడు విజయ్ చెవికి చేరింది. ఆయన వెంటనే ఆ బాల నటుడు ఆధీష్ ప్రవీణ్‌ను తన వద్దకు తీసుకురావలసిందిగా ఆదేశించారు. అంతే ఈ సమాచారం అందిన వెంటనే ఆధీష్ ప్రవీణ్ ఆదివారం చెన్నై వచ్చి తన అభిమాన నటుడు విజయ్ వద్ద వాలిపోయాడు. తన మాతృ భాష అయిన మలయాళంలో చాలా సేపు ముచ్చటించాడు. ఆయనతో సెల్ఫీఫొటో దిగి తెగ మురిసిపోయాడు. విజయ్ కూడా మరిన్ని అవార్డులను గెలుచుకుని, నటుడిగా ఉన్నత స్థాయికి ఎదగాలని బాల నటుడు ఆధీష్ ప్రవీణ్‌ను ఆశీర్వదించారు.