
రాధికా ఆప్టే
‘అంధాధున్’, ‘ప్యాడ్‌మ్యాన్’.. రెండు చిత్రాల్లోనూ నటించారు రాధికా ఆప్టే. ఈ రెండు చిత్రాలకు ఈ ఏడాది నేషనల్ అవార్డులు వచ్చాయి. ‘ఎలా ఫీలవుతున్నారు?’ అని ఇంటర్వ్యూలో ఎవరో అడిగారు. ‘‘సంతోషమే కానీ, ఎదురు చూసేంత సంతోషం కాదు’’ అన్నారు రాధిక. దానర్థం అవార్డులను ఆమె పట్టించుకోరని. ‘‘ఆడియెన్స్‌కి నచ్చితే చాలు. అంతకు మించి నేనేం ఆశించను. అవార్డు వచ్చినా, రాకున్నా నాకు ఒకటే. ఐయామ్ నాట్ అవార్డ్ – క్రేజీ పర్సన్’’ అన్నారు రాధిక.