![National Award Winner Daasi Sudarshan Pass Away - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/2/dasi-sudharshan.jpg.webp?itok=VOLx5NZX)
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి నేషనల్ అవార్డ్ అందుకున్న దాసి సుదర్శన్ (73) మరణించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన చిత్రకారుడు దాసి సుదర్శన్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. మిర్యాలగూడ స్వస్థలమైనప్పటికీ వృత్తిరీత్య నాగార్జున్‌సాగర్‌లోని హిల్ కాలనీలోని ప్రభుత్వ కళాశాలలో డ్రాయింగ్ టీచర్‌గా తన జర్నీని ప్రారంభించారు.
1988లో 'దాసి' సినిమాకు గాను ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాతీయ అవార్డు దక్కించుకున్న పిట్టంపల్లి సుదర్శన్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆ సినిమా వల్ల 'దాసి' సుదర్శన్‌గా గుర్తింపు పొందారు. తెలంగాణలోని మిర్యాలగూడకు చెందిన ఆయన ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్‌గా రాణించారు. అంతేకాకుండా రచయితగా, పాత్రికేయుడిగా, ఫొటోగ్రాఫర్‌గా,కార్టూనిస్టుగా కూడా ప్రసిద్ధికెక్కారు.
1988 లో విడుదలైన తెలుగు సినిమా దాసి. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకులు బి.నర్సింగరావు తెరకెక్కించారు. అలనాటి తెలంగాణలో దొరల నిరంకుశ పాలనలో చితికిపోయిన గ్రామ ప్రజల జీవితాలను ప్రతిబింబించిన చిత్రం. భావ వ్యక్తీకరణకు ప్రాధాన్యమిస్తూ ఆద్యంతం వాస్తవికధోరణిలో రూపొందించబడింది. ఈ చిత్రానికి దు జాతీయ అవార్డులను దక్కించుకోగా అందులో సుదర్శన్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా అవార్డు పొందారు. ఆ తర్వాత జాతీయ అవార్డుల జ్యూరీలో సభ్యులుగా కూడా ఆయన పనిచేశారు. సుదర్శన్ అంత్యక్రియలు మంగళవారం మిర్యాలగూడలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment