తాడిపత్రి మున్సిపాల్టీకి జాతీయ అవార్డు
తాడిపత్రి టౌన్ : సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ఓపెన్ డెఫికేషన్, పరిసరాల పరిశుభ్రతలో తాడిపత్రి మున్సిపాల్టీ జాతీయ అవార్డుకు ఎంపికైనట్లు ఇన్‌చార్జ్ కమిషనర్ రఘుకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. మే 4న ఢిల్లీలో మున్సిపల్ అధికారులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ఓపెన్ డెఫికేషన్, పరిసరాల పరిశుభ్రతలో తాడిపత్రి మున్సిపాల్టీలో గత జనవరిలో స్వచ్ఛ సర్వేక్షన్ బృందం పర్యటించి అవార్డుకు ఎంపిక చేసినట్టు ఆయన వివరించారు. తాడిపత్రితో పాటు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ఒంగోలు, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లు కూడా అవార్డుకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు.