హైదరాబాద్‌ డీఈవోకు జాతీయ అవార్డు | National Award to Hyderabad DEO | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ డీఈవోకు జాతీయ అవార్డు

Published Wed, Mar 8 2017 4:14 AM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM

హైదరాబాద్‌ డీఈవోకు జాతీయ అవార్డు

హైదరాబాద్‌ డీఈవోకు జాతీయ అవార్డు

ఎంఈవో శంకర్‌ రాథోడ్‌కు కూడా...

సాక్షి, హైదరాబాద్‌: విద్యా బోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సరికొత్త ఆవిష్కరణలు చేపట్టిన హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్‌కు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అవార్డును ప్రకటించింది. ‘విద్య పరిపాలనలో ఆవిష్కరణలు’ విభాగంలో రమేశ్‌కు జాతీయ అవార్డు రాగా.. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో హెచ్చార్డీ మం త్రి ప్రకాశ్‌ జవదేకర్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. రమేశ్‌ గతేడాది రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారిగా పని చేశారు.

వాట్సాప్‌ ద్వారా ఆంగ్ల సంభాషణపై టీచర్లకు శిక్షణ నివ్వడం, సందేహాలను నివృత్తి చేయడం, విద్యార్థులకు ఇంగ్లిష్‌ భాషపై అవగాహన కల్పించే అంశాలను నిర్దేశించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. అలాగే కమ్యూనిటీ మొబిలై జేషన్‌ విభాగంలో రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్‌ ఎంఈవో శంకర్‌ రాథోడ్‌కు కూడా జాతీయ అవార్డు వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement