స్టార్ హీరో అల్లు అర్జున్.. జాతీయ అవార్డు తనని వరించడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. తనకు శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికీ విషెస్ చెబుతూ నిన్నంతా గడిపేశాడు. ఇప్పుడు సడన్‌గా ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఇంటికెళ్లి మరీ ఆయన్ని కలిశాడు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఇంతకీ కారణమేంటి?
(ఇదీ చదవండి: 'పుష్ప 2' ముందున్న కొత్త సవాళ్లు.. బన్నీ ఏం చేస్తాడో?)
అల్లు అర్జున్-బ్రహ్మానందం బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సందర్భం దొరికినప్పుడల్లా కలుస్తూనే ఉంటారు. అయితే గతవారం బ్రహ్మానందం రెండో కొడుకు పెళ్లి జరిగింది. దీనికి హాజరు కాలేకపోయిన బన్నీ.. ఇప్పుడు స్వయంగా ఇంటికెళ్లి మరీ బ్రహ్మీ ఫ్యామిలీని కలిశారు. వాళ్లతో టైమ్ స్పెండ్ చేశారు. అయితే గత వారం మిస్ అయినప్పటికీ, గుర్తుపెట్టుకుని మరీ ఇప్పుడు బ్రహ్మీని ఆయన ఇంట్లోనే బన్నీ కలిశాడు.
అలానే తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుల్లో 'పుష్ప' సినిమాకు గానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా నిలిచాడు. ఈ విషయమై బన్నీతో మాట్లాడిన బ్రహ్మీ.. తన ఇంట్లో అతడిని సన్మానించాడు. ప్రస్తుతం బ్రహ్మీ కుటుంబం, కొడుకు-కోడలుతో అల్లు అర్జున్ దిగిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: 'జై భీమ్'కి జాతీయ అవార్డ్ అందుకే మిస్ అయిందా?)
Comments
Please login to add a commentAdd a comment