famine
-
జీవనదులు విలవిల
అమెరికాతో సహా యూరప్, ఆసియా ఖండాల్లోని పలు దేశాలు తీవ్ర దుర్భిక్షం బారిన పడుతున్నాయి. పెచ్చుమీరిన వేసవి తాపం, అత్తెసరు వర్షపాతం, నానాటికీ పెరిగిపోతున్న భూతాపం దెబ్బకు మహా మహా నదులన్నీ అక్షరాలా మటుమాయమే అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరార్ధ గోళం కనీవినీ ఎరుగని సంక్షోభంలో చిక్కి కొట్టుమిట్టాడుతోంది. పారిశ్రామిక, ఆహార ధాన్యాల ఉత్పత్తులు, సరుకు రవాణా, జల విద్యుదుత్పత్తి రంగాలన్నీ కుదేలవుతున్నాయి. ఈ దుర్భిక్షం గత 500 ఏళ్లలో ఎన్నడూ చూడని విపరిణామాలకు కారణమవుతోంది. 230 కోట్ల మందికి నీటి కొరత జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, చైనా, అమెరికా, ఇరాక్ వంటి దేశాల్లో నిత్యం నిండుగా ప్రవహించే జీవనదులన్నీ నిలువునా ఎండిపోతున్నాయి. దాంతో వాటికి అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్లు కూడా గుడ్లు తేలేస్తున్నాయి. ఫలితంగా కోట్లాదిమంది తాగు, సాగు నీటికి అల్లాడుతున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వల్ల చాలా దేశాలను వేధిస్తున్న ఆహార ధాన్యాల కొరత కాస్తా ఈ కరువు దెబ్బకు రెట్టింపైంది. 2022లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 230 కోట్ల మంది నీటి కొరత బారిన పడ్డట్టు ఐరాస నివేదికచెబుతోంది. లానినో పరిస్థితుల దెబ్బకు యూరప్‌లో 47 శాతంపై దుర్భిక్షం ఛాయలు కమ్ముకున్నాయని గ్లోబల్ డ్రాట్ అబ్జర్వేటరీ తాజా నివేదిక చెబుతోంది. బయట పడుతున్న చారిత్రక అవశేషాలు మహా నదులన్నీ ఎండిపోతుండటంతో ఎన్నడూ చూడని చారిత్రక అవశేషాలు వాటి గర్భం నుంచి బయటపడుతున్నాయి. అమెరికాలో కొలరాడో నది గర్భంలో లక్షలాది ఏళ్లనాటి డైనోసార్ అడుగుజాడలు బయటపడ్డాయి. స్పెయిన్‌లో బార్సెలోనా సమీపంలోని రిజర్వాయర్‌లో నీరు ఆవిరవడంతో 9వ శతాబ్దానికి చెందిన చర్చి బయట పడింది. మాడ్రిడ్‌లో వందల ఏళ్ల కింద నీట మునిగిన ఓ గ్రామ శిథిలాలు వెలుగు చూశాయి. స్పెయిన్‌లోనే కాసెరస్ ప్రావిన్స్‌లో క్రీస్తుపూర్వం 5 వేల ఏళ్లనాటి రాతి పలకలు చైనాలో యాంగ్జీ నదిలో బుద్ధ విగ్రహాలు బయటపడ్డాయి. ఇరాక్‌లో టైగ్రిస్ నది ఎండిన చోట మెసపటోమియా నగరికత కాలం నాటి రాజమహల్, నాటి నగరం బయట పడ్డాయి. నదులన్నింటా కన్నీళ్లే... ► జర్మనీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ దేశాల ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా చెప్పే రెయిన్ నది పరిస్థితి ఎంతో దైన్యంగా ఉంది. ► 2,900 కిలోమీటర్లు ప్రవహించి నల్లసముద్రంలోకలిసే ఈ నది ఎన్నోచోట్ల ఎండిపోయింది. ► రెయిన్, దాని ఉపనదులు, కాల్వల ద్వారా ఏటా ఏకంగా 8,000 కోట్ల డాలర్ల (రూ.6.4 లక్షల కోట్ల) విలువైన సరుకు రవాణా జరుగుతుంటుంది. అలాంటిది రవాణా నౌకలు కొంతకాలంగా చూద్దామన్నా కన్పించడం లేదు. ► ఆల్ఫ్స్ పర్వతాల్లో కరిగే మంచుతో నిత్యం నీటితో కళకళలాడే పో నది కూడా ఎండల దెబ్బకు జీవచ్ఛవంగా మారిపోయింది. ► ఇటలీలో 30 శాతం వ్యవసాయం ఈ నది మీదే ఆధారపడింది. ఇప్పుడు అదీ కుదేలైంది. గత కొన్ని దశాబ్దాల్లో ఇంతటి దుర్భిక్షాన్ని ఎన్నడూ చూడలేదంటూ ఇటలీ వాతావరణ నిపుణులు వాపోతున్నారు. ► ఇక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ వైన్ తయారీకి ఆధారమైన లోయెర్ నదిలో కూడా నీరు అతి వేగంగా అడుగంటుతోంది. ఫ్రాన్స్‌లో 600 కిలోమీటర్ల మేర ప్రవహించే ఈ నదిలో జలమట్టాన్ని కాపాడుకునేందుకు అనేక రిజర్వాయర్ల నుంచి నీటిని వదులుతున్నారు. ► యూరప్‌లో 10 దేశాల గుండా పారే అతి పొడవైన నది డాన్యూబ్ కూడా చిక్కిపోతోంది. ► అమెరికాలో డెన్వర్ నుంచి లాస్ఏంజెలెస్ దాకా 4 కోట్ల మంది నీటి అవసరాలు తీర్చే కొలరాడో నదిదీ ఇదే దుస్థితి! ► 45 లక్షల ఎకరాలకు నీరందించి ఏటా 1.4 లక్షల కోట్ల డాలర్ల వ్యవసాయ, తదితర ఆదాయాన్ని సమకూర్చే ఈ నది ఎండల ధాటికి చేతులెత్తేస్తోంది. ► నిత్యం ఉధృతంగా ప్రవహించే చైనాలోని యాంగ్జీ నది మరింత దుస్థితిలో ఉంది. సి చువాన్ ప్రావిన్స్‌కు జీవనాధారమైన ఈ నదిలో ఎక్కడ చూసినా నీరు అడుగంటి నదీగర్భం పైకి కన్పిస్తోంది. దాంతో ప్రభుత్వం కరువు హెచ్చరికలు జారీ చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బిహార్ దుర్భిక్షం (1873–74)
చరిత్రలో ఇది బెంగాల్ కరవుగా కూడా ప్రసిద్ధి. బిహార్ ప్రావిన్స్‌లో మొదలైన దుర్భిక్ష పరిస్థితులు కరవు కాటకాలకు దారి తీసి.. పొరుగున్న ఉన్న బెంగాల్, వాయవ్య, ఔద్ ప్రావిన్స్‌లకు కూడా ప్రబలాయి. లక్షా నలభై వేల చదరపు కిలోమీటర్ల మేర, 2 కోట్లకు పైగా జనాభా దుర్భిక్ష ప్రభావాలకు గురైంది. ఎటు చూసినా ఆకలి అలమటింపులు, సహాయం కోసం ఆక్రందనలు. ఆ సమయంలో బెంగాల్‌కు కొత్తగా వచ్చిన లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సర్ రిచర్డ్ టెంపుల్ శాయశక్తులా సహాయక చర్యలకు కృషి చేసి భారతీయుల అభిమాన పాత్రుడు అయ్యారు. మరణాలు తక్కువే కానీ, కరువు పెట్టిన మరణయాతన తక్కువేం కాదు. చట్టాలు ఇండియన్ ఓత్స్ యాక్ట్, గవర్నమెంట్ సేవింగ్స్ ప్రమోషన్ యాక్ట్, గవర్నమెంట్ సేవింగ్స్ బ్యాంక్ యాక్ట్, ఈస్ట్ ఇండియా స్టాక్ డివిడెండ్ రిడెంప్షన్ యాక్ట్, ఈస్టిండియా లోన్ యాక్ట్, ఇండియన్ రైల్వే కంపెనీస్ యాక్ట్, ఎక్స్ట్రాడిషన్ యాక్ట్, స్లేవ్ ట్రేడ్ యాక్ట్. జననాలు ఉపేంద్ర బ్రహ్మచారి : సైంటిస్టు, మెడికల్ ప్రాక్టీషనర్ (బెంగాల్ ప్రెసిడెన్సీ), ఎ.కె.ఫజ్నుల్ హక్ : బ్రిటిష్ ఇండియన్. పాకిస్తానీ లాయర్. గ్రంథకర్త. షేర్–ఎ–బంగ్లా గా ప్రసిద్ధి (బంగ్లాదేశ్), మార్ థామస్ కురియలఛెరి : కేరళ క్యాథలిక్ బిషప్. చంగనస్సెరి ఆర్చ్డయోసిస్ తొలి బిషప్. -
Ukraine War: యుద్ధం ఆపకుంటే ఆకలి కేకలు తప్పవు!
ఉక్రెయిన్ ప్రపంచంలోనే అత్యధికంగా ఆహారోత్పత్తులను ఎగుమతి చేసే దేశం. అలాంటి దేశం యుద్ధంతో తల్లడిల్లుతోంది. రష్యా బలగాల దాడుల్లో పంట పండించడం కష్టతరంగా మారడమే కాదు.. ఇప్పటికే ఉన్న పంట నాశనం అయిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే.. ఉక్రెయిన్‌తో పాటు కొన్ని దేశాల్లో ఆకలి కేకలను ప్రపంచం చూడాల్సి వస్తుంది. ఈ మాటలు అంటోంది ఎవరో కాదు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ. ఒకవైపు రష్యాకు లొంగిపోయే ప్రసక్తే లేదంటున్న జెలెన్స్కీ.. ఏది ఏమైనా శాంతి చర్చల ద్వారానే సమస్య పరిష్కారం కావాలని, అందుకోసం ఎంత దూరమైనా వెళ్తానని అంటున్నాడు. ఉక్రెయిన్‌పై రష్యా బలగాల దాడులు 27వ రోజుకి చేరిన వేళ.. మంగళవారం ఇటాలియన్ పార్లమెంట్‌ను ఉద్దేశించి జెలెన్స్కీ ప్రసంగించాడు. రష్యా దాడులు ఒక్క ఉక్రెయిన్ను మాత్రమే సంక్షోభంలో నెట్టేయదని, చాలా దేశాలు ఆహార కొరతతో ఇబ్బందిపడతాయని జెలెన్స్కీ అంటున్నాడు. కాబట్టి, ఆక్రమణదారులను ఓడించేందుకు సాయం చేయాలంటూ ఇటలీ ప్రతినిధులను కోరాడాయన. దానికి ఇటలీ కూడా సానుకూలంగానే స్పందించింది. ఇక ఉక్రెయిన్ నుంచి గోధుమలు, మొక్కజోన్న, సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలోనే మేజర్ వాటాదారునిగా ఉంది ఉక్రెయిన్. అయితే రష్యా దాడుల నేపథ్యంలో.. నల్ల సముద్ర తీరాలను షిప్పులు దాటే పరిస్థితి లేకపోవడంతో ఎక్కడికక్కడే వాణిజ్యం స్థంభించి పోయింది. పైగా ఉత్పత్తుల్లో చాలావరకు పాడైపోయినట్లు ఉక్రెయిన్ అధికారులు చెప్తున్నారు. లెబనాన్, ఈజిప్ట్, యెమెన్.. ఇతర దేశాలు ఇటీవలి సంవత్సరాలలో ఉక్రేనియన్ గోధుమలపై ఆధారపడుతున్నాయి. ఈ యుద్ధం ఎఫెక్ట్‌తోనే గోధుమల ధరలు గత నెలలో 50% మేర పెరిగాయి. ఇదిలా ఉంటే.. పాశ్చాత్య దేశాల అధినేతలను ఉద్దేశించి జెలెన్స్కీ ఓ వీడియో లింక్‌ను విడుదల చేశాడు. ఉక్రెయిన్ ఎల్లప్పుడూ అతిపెద్ద ఆహార ఎగుమతిదారులలో ఒకటనే విషయం తెలుసు కదా, అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే.. ఇప్పుడు పరిస్థితుల్లో కొన్ని దేశాలు ఆకలి కేకలు పెట్టొచ్చు. రష్యన్ ఫిరంగి దాడులతో ఉన్న పంటలు నాశనం అవుతున్నాయి.. ఇంక కొత్త పంటలు ఎలా పండుతాయి? అని నిలదీశాడు. పోప్.. ప్లీజ్ జోక్యం చేసుకోండి ఉక్రెయిన్ పరిణామాలపై జెలెన్స్కీ, పోప్ ఫ్రాన్సిస్‌తో ఫోన్లో చర్చించినట్లు సమాచారం. ఈ విషయంలో జోక్యం చేసుకుని.. శాంతి చర్చల ద్వారా ఒక ముగింపు పలకాలని ఆయన్ని జెలెన్స్కీ కోరినట్లు సమాచారం. ఈ మేరకు చర్చల సారాంశం తాలుకా సందేశాన్ని ఆయన ట్విట్టర్లో సైతం పోస్ట్ చేశారు. అయితే పోప్-Russian Orthodox Patriarch Kirill మధ్య శాంతి స్థాపన కోసం ఈ నెల మొదట్లోనే చర్చలు జరిగాయి. కానీ, Patriarch Kirill of Moscow మాత్రం.. ఉక్రెయిన్ బలగాలను దుష్టశక్తులుగా పేర్కొంటూ యుద్ధానికి ఎగవేస్తుండడం విశేషం. ఇక యుద్ధం మొదలై.. దాదాపు నెలరోజులు కావొస్తున్న చర్చల్లో ఎలాంటి పురోగతి లేకుండా పోవడంతో ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. Talked to @Pontifex. Told His Holiness about the difficult humanitarian situation and the blocking of rescue corridors by Russian troops. The mediating role of the Holy See in ending human suffering would be appreciated. Thanked for the prayers for Ukraine and peace. pic.twitter.com/wj4hmrTRGd — Володимир Зеленський (@ZelenskyyUa) March 22, 2022 చదవండి: భాష రాక ఉక్రేనియన్ల గోస.. ఆ అంధుడికి సలాం! -
అన్నం పెట్టలేక... బిడ్డలనే అమ్మేస్తున్నారు!
డొక్కలీడ్చుకుపోయి.. ఎముకలపై చర్మం మాత్రమే ఉన్న చిన్నారులు... కుటుంబాన్ని బతికించుకునేందుకు శరీర అవయవాలను అమ్ముకుంటున్న పెద్దలు.. మిగిలిన బిడ్డలను బతికించుకోవడానికి ఓ బిడ్డను అమ్ముకుంటున్న కుటుంబాలు... పుట్టెడు దు:ఖాన్ని దాచేసి ఏ భావమూ కనిపించకుండా నిర్విరాకరంగా నఖాబ్ మాటున కళ్లు... ఇది ప్రస్తుత ఆఫ్గన్ ముఖ చిత్రం. తినేందుకు తిండి లేదు. చేసేందుకు పనిలేదు. ఎక్కడ చూసినా కరువు. ఆకలి చావులు. మానవతా దృక్పథంతో ప్రపంచం ఆఫ్గనిస్తాన్ ను ఆదుకోవాలని ఐక్యరాజ్యసమితి కోరుతోంది. కాబూల్: ప్రపంచానికి కరోనా ఒక్కటే బాధ. ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటైన అఫ్గానిస్తాన్ తాలిబన్ల చెరలోకి వెళ్లాక... ఆర్థిక సంక్షోభం, కరువు వేధిస్తోంది. అమెరికా తమ ఫెడరల్ బ్యాంకు నుంచి, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ల నుంచి అఫ్గాన్ అందాల్సిన నిధులను స్తంభింపజేయడంతో... ప్రజల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఆహార సంక్షోభంతో ఆకలిచావులు పెరిగిపోయాయని.. ఐరాస ప్రపంచ ఆహార కార్యక్రమం చీఫ్ డేవిడ్ బేస్లీ మళ్లీ ఆందోళన వ్యక్తం చేశారు. తాలిబన్ల వశమవ్వడానికి ముందు కూడా అఫ్తానిస్తాన్‌లో కరువు ఉంది. కానీ... ఆ తరువాత మరింత పెరిగింది. వేలాది మంది ఉపాధ్యాయులు, భవన నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులు.. వారు వీరనే తేడా లేదు. ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. దేశంలో ప్రధాన ఆధారం వ్యవసాయం. ఈ ఏడు వ్యవసాయమే లేదు. దీంతో రెండున్నర కోట్లకు కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. కూరగాయలు, మాంసం, పాలు ఏవీ లేవు. ఐదేళ్లలోపు పిల్లలు, గర్భిణీల్లో పోషకాహార లోపం పెరిగిపోతోంది. కుటుంబానికి పిడికెడన్నం పెట్టడం కోసం కడుపున పుట్టిన పిల్లలను, ఇంట్లో ఉన్న వస్తువులను సైతం అమ్ముకుంటున్నారు. పదిలక్షల మంది ఐదేళ్లలోపు పిల్లలు ఆకలితో చనిపోయే స్థితిలో ఉన్నారు. సగం పైగా జనాభాకు కేవలం నీళ్లు, బ్రెడ్ మాత్రమే దొరుకుతోంది. ఒక్కోసారి అది కూడా ఉండటం లేదు. పనిలేదు, ఆదాయం లేదు. ఇంట్లో పిల్లల కడుపునింపే పరిస్థితి లేదు. ఆకలితో అలమటిస్తున్న పిల్లల ముఖాలు చూసే ధైర్యం చేయలేకపోతున్నారు తల్లిదండ్రులు. ‘ఆఫ్ఘన్ ప్రజలు మనుగడ కోసం తమ పిల్లలను, వారి శరీర భాగాలను విక్రయిస్తున్నారు. దేశంలో సగానికి పైగా జనాభా ఆకలితో అలమటిస్తోంది. అంతర్జాతీయ సమాజం ఆఫ్గానిస్తాన్‌కు సహాయాన్ని వేగవంతం చేయాలి’ అని ఆయన కోరారు. మనవాతా హృదయంతో యావత్ ప్రపంచం స్పందించాలని బేస్లీ కోరారు. ఆఫ్గానిస్తాన్‌లో కరువు, మహమ్మారి, ఆర్థిక పతనం, సంవత్సరాల సంఘర్షణ ప్రభావాలతో పోరాడుతోంది. నాలుగు కోట్ల మందిలో దాదాపు రెండున్నర కోట్ల ప్రజలు తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ శీతాకాలంలో సగానికి పైగా జనాభా కరువు బారినపడ్డారు. ఈ సంవత్సరం జనాభాలో 97 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన పడిపోవచ్చని బేస్లీ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది ఆగస్టులో అమెరికా, మిత్రదేశాలు దేశం వదిలి వెళ్లినప్పటికీ అనేక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు సాయం చేస్తూనే ఉన్నాయి. కొంత ఆహార సంక్షోభం, మానవతా సంక్షోభాన్ని కొంత తగ్గించగలిగాయి. అయినా పరిస్థితుల్లో రావాల్సినంత మార్పు రాలేదు. అందుకే ప్రస్తుత ఆకలి సంక్షోభాన్ని పరిష్కరించడానికి అఫ్గాన్‌కు సహాయం చేయాలని ప్రపంచంలోని సంపన్నులకు బేస్లీ పిలుపునిచ్చారు. ఇప్పటికే పలు దేశాలు సాయం అందిస్తున్నాయని.. మానవాతా వాదులంతా ఇంకా సాయం చేయాలని బేస్లీ కోరారు. ‘ప్రపంచంలోని బిలియనీర్లు తరగని ఆస్తులు సంపాదించారు. ఆ సంపద పెరుగుదల నికర విలువ రోజుకు నాలుగువేల కోట్లు. ఇలాంటి స్వల్పకాలిక సంక్షోభాలను పరిష్కరించడానికి మీ ఒకరోజు నికర విలువ పెరుగుదల సరిపోతుంది. కాబట్టి మంచి మనసుతో సహాయం చేయడానికి ముందుకు రండి’ అని బిలియనీర్లకు పిలుపునిచ్చారు. యురోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నార్వే, యూకే, అమెరికా ప్రత్యేక ప్రతినిధులు, ప్రత్యేక రాయబారులతో జనవరి 24న ఓస్లోలో సమావేశమై ఆఫ్గన్ పరిస్థితులపై చర్చించారు. ఆఫ్గన్ల ఆకలి తీర్చాలంటే ఆహార భద్రతా కార్యక్రమానికి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు కావాలని తెలిపింది. -
మరింత భయంకరంగా 2021..
జెనివా: కరోనా వైరస్ మహమ్మారి ఈ ఏడాదిని ఎంతో దుర్భరంగా మార్చేసింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఈ ఏడాది ఎప్పుడు ముగుస్తుందా.. కొత్త సంవత్సరంలోకి ఎప్పుడు అడుగుపెడతామా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కనీసం నూతన సంవత్సరం అయినా సంతోషంగా ఉంటామని భావిస్తున్నారు. అయితే వచ్చే ఏడాది మరింత దారుణంగా ఉండనుందని.. విపత్తుగా మిగిలిపోనుందంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం(డబ్ల్యూఎఫ్‌పీ) చీఫ్ డేవిడ్ బీస్లీ రాబోయే సంవత్సరం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. "విపత్తు" మానవతా సంక్షోభాలకు తమను తాము సిద్ధం చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, 2021 దాదాపు ఒక శతాబ్దంలో మానవులు చూసిన అత్యంత చెత్త సంవత్సరాల్లో ఒకటిగా నిలిచిపోనుందట. వచ్చే సంవత్సరం తీవ్రమైన ఆకలి, కరువు తాండవిస్తాయని.. ముఖ్యంగా మూడవ ప్రపంచ దేశాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు నిపుణులు తెలిపారు. (చదవండి: 2030 నాటికి దారిద్య్రంలోకి మరో 20.7 కోట్ల మంది) కొనసాగుతున్న కరోనావైరస్ మహమ్మారి, ప్రపంచంపై దాని ప్రభావాల గురించి చర్చ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో బీస్లీ ఈ హెచ్చరికలు జారీ చేశారు. డబ్ల్యూఎఫ్‌పీ ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 270 మిలియన్ల మంది ప్రజలు "ఆకలి వైపు పయనిస్తున్నారు", రానున్న ఏడాది తీవ్రమైన కరువు ఉండబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా బీస్లీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం మహమ్మారి విజృంభణ వల్ల తలెత్తిన సంక్షోభం వచ్చే ఏడాది కూడా కొనసాగనుంది. ఈ ఏడాది దాదాపు 19 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేశాము. అయితే ఈ మొత్తానికి సంబంధించిన ఫలితం వచ్చే ఏడాది మనకు దక్కకపోవచ్చు’ అన్నారు. అంతేకాక ‘ఐక్యరాజ్యసమితి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లైతే 2021 చెత్త మానవతా సంక్షోభ సంవత్సరంగా ఉండబోతుంది. మనం మరో మెట్టు దిగబోతున్నాం’ అని హెచ్చరించారు. (చదవండి: ఆహారదాతకు ‘నోబెల్ శాంతి’) ఈ విపత్తు పరిస్థితికి కేవలం మహమ్మారి మాత్రమే కారణం కాదన్నారు బీస్లీ. కోవిడ్, దాని కట్టడి కోసం విధించిన ప్రభుత్వం నియంత్రిత లాక్డౌన్ మానవ పురోగతిని బాగా క్షీణింపజేశాయని.. "మానవ నిర్మిత సంఘర్షణ" కూడా ఈ పరిస్థితిలో ప్రధాన పాత్ర పోషించిందని తెలిపారు. ముఖ్యంగా సిరియా, యెమెన్, దక్షిణ సూడాన్ వంటి దేశాలలో పరిస్థితి మరింత భయంకరంగా ఉండబోతుందని హెచ్చరించారు బీస్లీ. "మేము ఈ యుద్ధాలలో కొన్నింటిని ముగించాల్సి వచ్చింది. ఈ యుద్ధాలను మేము అంతం చేయవలసి ఉంది. అప్పుడే మనం కోరుకునే స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించగలము" అని బీస్లీ తెలిపారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని ఆయన టైటానిక్‌తో పోల్చారు. ‘మేము వ్యూహాత్మకంగా వ్యవహరించి.. ఈ ప్రత్యేకమైన మంచుకొండకు నిధులను కేటాయించగల్గితే.. 2021లో వాటి ఫలితాలను పొందగలం. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే.. ఆర్థిక వ్యవస్థని పునర్నిర్మించగలం’ అన్నారు. గతంలో డబ్ల్యుఎఫ్‌పి ఈ ఏడాది చివరినాటికి పోషకాహార లోపం ఎదుర్కొంటున్న ప్రజల సంఖ్య 80 శాతం పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వాలను హెచ్చరించింది. -
బెంగాల్ కరవుకు ఓ ‘మానవుడు’ కారణం
సాక్షి, న్యూఢిల్లీ : 1873–74, 1876, 1877, 1896–97, 1899, 1943.. ఈ సంవత్సరాల్లో ఏం జరిగిందో ఎవరికీ గుర్తుండకపోవచ్చు! భారతావనిపై కరవు జెడలు విప్పి కరాళ నృత్యం చేసిన పీడ ఎడాదులు. పీడ కలల్లా వాటిని మరచిపోవడమే మంచిది, ఒక్క 1943లో వచ్చిన బెంగాల్ కరవును మినహా. దాదాపు 30 లక్షల మందిని పొట్టన పెట్టుకున్నందున బెంగాల్ కరవును మరచి పోరాదని చెప్పడం లేదు. అంతకుముందు సంభవించిన ఐదు కరవులకు, ఈ ఆరో కరవుకు ఎంతో తేడా ఉండడమే. అంతకుముందు కరవులన్నీ ప్రకృతి సిద్ధంగా సంభవించినవే. అంటే, వర్షాలు లేక వడగాలులు పెరిగి, పంటలు పండక, తినడానికి తిండిలేక సంభవించినవి. కానీ బెంగాల్ కరవు అలాంటిది కాదు. ఓ మానవుడు అనుసరించిన విధానల వల్ల సంభవించిన కరవు. ఇది ఎలా రుజువైందంటే అమెరికా, భారత్ శాస్త్రవేత్తల బృందం కరవు సంభవించిన ఆ ఆరు కాలాల్లో భూమిలో తేమ శాతం ఎంతుందన్న విషయాన్ని పరిశోధనలతో ధ్రువీకరించడం ద్వారా. భూమిలో ఓ మోస్తారు స్థాయి వరకు తేమ ఉన్నట్లయితే ఆ సంవత్సరం వర్షాలు బాగానే కురిసినట్లు లెక్క. అంతకన్నా తేమ స్థాయి తగ్గుతూ పోతే అంత ఎక్కువ కరవు సంభవించినట్లు లెక్క. ఇక్కడ 1943లో మినహా మిగతా అన్ని కరవు సంవత్సరాల్లో భూమిలో తేమ బాగా తగ్గిందట. 1943లో భూమిలో ఎక్కువ తేమ ఉన్నట్లు తేలడమే కాకుండా ఆ ఏడాది చివరలో సమృద్ధిగా వర్షాలు కురిసినట్లు ఎన్నో చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆకలితో చనిపోయిన 30 లక్షల మందిలో ఎక్కువ మంది కూడా ఏడాది చివరలో మరణించడం గమనార్హం. ఈ కారణంగా 1943 నాటి కరవు ఓ మానవుడు సృష్టించిన కరవుగా గాంధీనగర్‌లోని ఐఐటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న విమల్ మిశ్రా, అమర్దీప్ తివారీ, శరణ్ ఆధార్, రీపల్ షా, మూ జీయావో, డీఎస్ పాయ్, డెన్నీస్ లెట్టన్‌మెయిర్‌తో కలిసి జరిపిన పరిశోధనల్లో తేల్చారు. వాటిని వివరాలను ‘జియోఫిజికల్ రిసర్చ్ లెటర్స్’ తాజా సంచికలో ప్రచురించారు. ఆ మానవుడే విన్స్టన్ చర్చిల్ 1943లో సంభవించిన బెంగాల్ కరవుకు నాటి బ్రిటీష్ ప్రధాన మంత్రి విన్స్టన్ చర్చిల్ అనుసరించిన విధానాలే ప్రధాన కారణం. నాడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నందున చర్చిల్, బ్రిటీష్ సైన్యానికి భారీగా ఆహార పదార్థాలను భారత్ నుంచి తరలించారు. పరోక్షంగా జపాన్ దేశం కూడా కారణం. నాటి బర్మా నేటి మయన్మార్‌ను 1943లోనే జపాన్ ఆక్రమించుకొంది. దాంతో భారత్‌కు బియ్యం దిగుమతులు నిలిచిపోయాయి. అప్పటికి బర్మా నుంచే భారత్‌కు భారీగా బియ్యం దిగుమతులు వచ్చేవి. చర్చిల్ కారణంగా కాకుండా బర్మా నుంచి బియ్యం దిగుమతులు నిలిచి పోవడం వల్లనే ఎక్కువ కరవు ఏర్పడిందన్నది చరిత్రకారులు చెబుతూ వచ్చారు. చర్చిల్, బ్రిటీష్ సైన్యానికి భారీగా ఆహార దినుసులను ఎగమతి చేయడం వల్ల బెంగాల్‌లోని పేదలకు ఆహార దినుసులు అందుబాటులో లేకుండా పోయాయని భూమిలో తేమను రుజువుగా చూపుతున్న ఈ పరిశోధకులు చెబుతున్నారు. 1873–74లో కరవు వచ్చినప్పుడు బెంగాల్‌కు లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా పనిచేసిన రిచర్డ్ టెంపుల్ దేశంలోని వివిధ ప్రాంతాలు, పలు దేశాల నుంచి ఆహార దినుసులను దిగుమతి చేయించారట. ఆయన అనుసరించిన విధానాన్ని అనుసరించాల్సిందిగా విన్స్టన్ చర్చిల్ ముందుకు నాడు ప్రతిపాదన వస్తే ఆయన నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చారట. 1943లో బయటి నుంచి ఆహార దినుసులను సరిపడా దిగుమతి చేసుకోకపోవడం తప్పిదమని భారతీయ ఆర్థికవేత్త అమర్త్యసేన్ కూడా 1981లో రాసిన ఓ వ్యాసం ఆరోపించారు. 70 వేల టన్నుల బియ్యం ఎగుమతి 1943లో జనవరి నుంచి జూలై నెలల మధ్య భారతదేశం నుంచి 70 వేల టన్నుల బియ్యం సైనిక అవసరాల కోసం ఎగుమతి అయ్యాయని, అది కరవును మరింత తీవ్రం చేసిందంటూ ‘చర్చిల్స్ సీక్రెట్ వార్: ది బ్రిటీష్ ఎంపైర్ అండ్ రివేజింగ్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ది సెకండ్ వరల్డ్ వార్’ పుస్తకంలో (2011) మధుశ్రీ ముఖర్జీ రాశారు. సైన్యం కోసం బ్రిటన్‌లో అపార నిల్వలు ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తంటూ భారత్ నుంచి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకున్నారంటూ ఆమె తన పుస్తకంలో ఆరోపించారు. ఈ అంశం నాడు బ్రిటీష్ వార్ కేబినెట్లో ప్రస్తావనకు వచ్చినప్పుడు ‘మనలాగే అక్కడి ప్రజలకు కూడా ముందు జాగ్రత్త ఉండాలి’ అంటూ చర్చిల్ వ్యాఖ్యానించారని ఆమె తన పుస్తకంలో పేర్కొన్నారు. ‘నరహంతక నియంతల్లో ఒకడైన, చేతులు రెండు రక్తంతో తడిసిపోయిన చర్చిల్‌నా స్వాతంత్య్ర పిపాసి, ప్రజాతంత్ర వాదిగా ప్రశంసించుమని బ్రిటీష్ మనకు చెప్పేది’ అని పుస్తకాలు ఎక్కువగా చదివే అలవాటున్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చిల్‌కు బాగా నప్పుతాయి. -
కేప్‌టౌన్‌కు ఐస్‌బర్గ్స్ ఉపశమనం..!!
జోహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఏర్పడిన తీవ్ర నీటి కొరతను తగ్గించేందుకు మెరైన్ నిపుణులు ఆ దేశ ప్రభుత్వం ముందు పరిష్కారాన్ని ఉంచారు. అంటార్కిటికా ఖండం నుంచి భారీ మంచు దిమ్మెలను కేప్‌టౌన్‌కు తీసుకువచ్చి, కరువు ప్రాంతాల్లోని నీటి కుంటలు, సరస్సులు, నదుల్లో వాటిని కరిగించాలనేది ప్రతిపాదన. 20వ శతాబ్దంలోనే అతిపెద్ద కరువుగా కేప్‌టౌన్ కరువును అభివర్ణిస్తున్న విషయం తెల్సిందే. మంచు దిమ్మెలను కేప్‌టౌన్‌కు తీసుకురావడ తప్ప కరువుకు మరో ప్రత్యామ్నాయం ఏమీ లేదని నిపుణులు దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. 2015 నుంచి కేప్‌టౌన్‌లో తీవ్రదుర్భిక్షం నెలకొంది. దీంతో ఈ కరువును దక్షిణాఫ్రికా ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించింది. కేప్‌టౌన్‌లో ఇప్పటికే నీటిపై ఆంక్షలు ఉన్నాయి. ఈ ఏడాది వర్షాలు లేకపోతే తాగునీరు పూర్తిగా లేకుండా పోయే ప్రమాదం ఉంది. అనుమతిస్తే అంటార్కిటికా నుంచి మంచు తునకలను త్వరగా కరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకుని కేప్‌టౌన్‌కు తీసుకువస్తామని నిపుణులు దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి నివేదించారు. ఒక భారీ ఐస్‌బర్గ్ ఏడాది పాటు కరుగుతూ రోజుకు 150 మిలియన్ లీటర్ల తాగునీటిని ఇస్తుందని పేర్కొన్నారు. -
కరవును తట్టుకునే హార్మోన్ ఇదే..
వాతావరణం మారిపోతోంది... అకాల వర్షాలు, వరదలు సాధారణమైపోతున్నాయి. ఈ నేపథ్యంలో మొక్కలు అతి తక్కువ నీటితోనూ బతికేయగలిగేందుకు ఉపకరించే ఓ హార్మోన్‌ను జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. నేలలో తేమ తక్కువగా ఉన్నప్పుడు సీఎల్ఈ 25 పెప్టైడ్ వేళ్లను వదిలి ఆకుల్లోకి చేరిపోతుంది. దాంతోపాటు ఆకుల ఉపరితలంపై ఉండే రంధ్రాలు మూసుకుపోయేలా చేసి మొక్కలోని నీరు ఆవిరైపోకుండా కాపాడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మనుషుల్లోనూ ఇలాంటి పెపై్టడ్లు ఉంటాయని.. శరీరం వాతావరణ పరిస్థితులకు తట్టుకుని నిలిచేందుకు ఇవి ఉపయోగపడతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త టకహషి అంతున్నారు. మొక్కల్లోనూ ఇలాంటి వాటి కోసం పరిశోధనలు చేపట్టగా తమకు సీఎల్ఈ 25 గురించి తెలిసిందని చెప్పారు. రకరకాల సీఎల్ఈ పెప్టైడ్లను మొక్కల వేళ్లకు అందించి చూసినప్పుడు.. నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు సీఎల్ఈ25 ఒక్కటే ఆకుల్లోకి చేరుతున్నట్లు తాము గుర్తించామని వివరించారు. ఏబీఏ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా ఈ పెప్టైడ్ రంధ్రాలను పూడుస్తున్నట్లు తెలిసింది. ఈ పరిశోధనల ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోగల కొత్త వంగడాల తయారీకి వీలేర్పడుతుందని అంచనా. -
సాగు యజ్ఞం.. కరువుపై యుద్ధం చేద్దాం
వ్యవసాయాన్ని పండుగ చేద్దాం: అధికారులకు సీఎం కేసీఆర్ పిలుపు - 55 లక్షల మంది రైతుల బతుకులను బాగుచేద్దాం - ఒక్కో వ్యవసాయాధికారి ఒక్కో కేసీఆర్ కావాలి - రైతు పెట్టుబడి పథకానికి వచ్చే బడ్జెట్లో రూ.7,500 కోట్లు కేటాయిస్తాం - మరో 500 ఏఈవో పోస్టులు భర్తీ చేస్తాం - ఏఈవోలకు త్వరలో ల్యాప్‌టాప్‌లు ఇస్తాం - వచ్చే జూన్ 10 నాటికి రైతుల వివరాలన్నీ సేకరించాలి సాక్షి, హైదరాబాద్: ‘‘వ్యవసాయం ఛిన్నాభిన్నమైంది.. రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి.. ఆ పరిస్థితి పోవాలి. వ్యవసాయం దండగ కాదు.. పండుగ చేద్దాం. 55.49 లక్షల మంది రైతుల బతుకులు బాగుచేద్దాం. దరిద్రం, కరువు కాటకాలపై యుద్ధం చేద్దాం. ఒక్కో వ్యవసాయాధికారి ఒక్కో కేసీఆర్ కావాలి..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వ్యవసాయ యజ్ఞం మొదలైందని ప్రకటించారు. ‘రైతుహిత’ పేరిట మంగళవారమిక్కడ హెచ్ఐసీసీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వ్యవసాయాధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. వ్యవసాయాధికారులు ఈలలు, చప్పట్లతో సీఎం ప్రసంగంపై అడుగడుగునా హర్షం వ్యక్తంచేశారు. రైతుకు పెట్టుబడి ఖర్చు కింద ఆర్థికసాయం చేసేందుకు వచ్చే బడ్జెట్లో రూ.7 వేల నుంచి రూ.7,500 కోట్లు కేటాయిస్తామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. ప్రతి రైతుకు వానాకాలంలో మే 15 నాటికి, యాసంగిలో అక్టోబర్ నాటికి ఎకరానికి రూ.4 వేల చొప్పున రైతు ఖాతాలో జమ చేస్తామన్నారు. వచ్చే జూన్ 10వ తేదీ నాటికి వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవోలు) తమ పరిధిలోని 5 వేల ఎకరాలపై సమగ్ర విశ్లేషణ చేయాలన్నారు. ‘‘ఎంత భూమి ఉంది? ప్రాజెక్టులు, రోడ్లు, కాలువలు, పరిశ్రమలు, కంపెనీలు, రియల్ ఎస్టేట్ కింద ఇతరత్రా అవసరాలకు ఏమైనా పోయిందా? ఈ అంశాలన్నింటినీ పరిశీలించి నికరంగా సాగు భూమి నిర్ధారణ చేయాలి. ఒక్కో రైతు పేరిట ఎంత భూమి ఉంది? సర్వే నంబర్, ఇంటి నంబర్, సెల్ నంబర్ తప్పనిసరిగా సేకరించాలి. ఈ సమగ్ర సమాచారం సేకరించి నాకు పంపాలి. మొత్తం ఆన్లైన్ చేయాలి. అలాగే ట్రాక్టర్లు, కల్టివేటర్లు, రోటావేటర్లు, నాటు యంత్రాల సమాచారం కూడా సేకరించాలి. వడగళ్ల వానలు ఎక్కువగా కురిసే ప్రాంతాలను కూడా గుర్తించి... ఆ సమయానికి ముందు పండే పంటలు వేసేలా చూడాలి. సూక్ష్మసేద్యం కింద ఎంత భూమి ఉందో గుర్తించాలి’’అని సీఎం ఆదేశించారు. రైతుసంఘం పంపిన జాబితాకే డబ్బులు ఏఈవోలు గ్రామరైతు సంఘాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. గ్రామ సంఘం అధ్యక్షులు, కార్యదర్శులతో కలిపి మండల రైతు సమాఖ్య ఏర్పాటు కావాలని, వాటి అధ్యక్ష కార్యదర్శులతో కలిపి జిల్లా రైతు సమాఖ్య, అలాగే రాష్ట్ర రైతు సమాఖ్య ఏర్పాటు కావాలని పేర్కొన్నారు. రాష్ట్ర రైతు సమాఖ్య అధ్యక్షుడు సీఎం అంత పవర్‌పుల్‌గా ఉండాలన్నారు. ‘‘వచ్చే ఏడాది బడ్జెట్లో రాష్ట్ర రైతు సమాఖ్యకు రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్‌గా ఇది ఉంటుంది. రైతు పండించిన పంటకు సరైన ధర కోసం వ్యాపారులతో మండల లేదా జిల్లా రైతు సమాఖ్య చర్చిస్తుంది. తేమ శాతాన్ని కూడా సమాఖ్యే నిర్ధారిస్తుంది. సరైన ధర ఇస్తే సరేసరి లేకుంటే ధాన్యాన్ని బియ్యం పట్టించి పక్క రాష్ట్రాలకు సమాఖ్యే అమ్ముతుంది. అప్పుడు దళారుల తిక్క కుదురుతుంది. రూ.4 వేల సాయం పొందే రైతుల జాబితాను ఏఈవో, గ్రామ రైతుసంఘమే గుర్తించాలి. వారు పంపిన జాబితాకే డబ్బులు పంపిస్తాం. రూ.4 వేలల్లో రూ.2,200 లేదా రూ.2,300కు ఎరువులు వస్తాయి. మిగిలిన వాటితో విత్తనాలు, పెస్టిసైడ్స్, కూలీకి కూడా సరిపోతాయి. రైతు సంఘాలు ఏర్పడ్డాక వారందరినీ హైదరాబాద్ పిలుస్తా. లేకుంటే నేనే కొన్ని జిల్లాలకు వచ్చి సమావేశం ఏర్పాటు చేస్తా. 5 వేల ఎకరాల ఏఈవో క్లస్టర్లో అందరికీ అందుబాటులో ఉండే ఒక గ్రామాన్ని గుర్తించాలి. మూడు, నాలుగొందల మంది రైతులు కూర్చొనేలా ఆ గ్రామంలో ఈ ఏడాదే షెడ్డు నిర్మిస్తాం. పక్కనే గోదాం నిర్మిస్తాం. ప్రతీ ఏఈవో పరిధిలో మినీ లేబొరేటరీలు ఏర్పాటు చేస్తాం. వాటిల్లో భూసార పరీక్షలు నిర్వహించాలి. వచ్చే ఏడాది నాటికి భూసార పరీక్షలు పూర్తి చేసి కంప్యూటరైజ్ చేయాలి. అన్నీ సిద్ధం చేసి వచ్చే జూన్ నుంచి యుద్ధం మొదలు పెట్టాలి’’అని అన్నారు. సరళమైన భాషలోనే రైతులతో మాట్లాడాలని సూచించారు. వ్యవసాయాధికారులకు ల్యాప్‌టాప్‌లు రాష్ట్రంలోని 3,500 మంది వ్యవసాయాధికారులకు 10–15 రోజుల్లో ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఏఈవోలు మోటార్ సైకిల్ కొనుగోలు చేసుకునేందుకు వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు. అధికారులకు వాహన భత్యం పెంచుతామని, మరో 500 మంది ఏఈవో పోస్టులు నెల రోజుల్లో భర్తీ చేస్తామని వెల్లడించారు. ‘‘300 మంది వ్యవసాయాధికారులను ఇజ్రాయెల్ పంపిస్తాం. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు, కమిషనర్ పద్ధతి మార్చుకోవాలి. పర్యవేక్షించడమే కాకుండా క్షేత్రస్థాయి ఉద్యోగులతో సమాచారం తెప్పించుకోవాలి. వ్యవసాయ వర్సిటీలో ఉత్పాదకతపై పరిశోధనలు జరగాలి. మొత్తం 330 గోదాములకుగాను 310 పూర్తయ్యాయి. అవగాహన లేని ఆర్థికవేత్తలు వ్యవసాయం దండుగ అంటున్నారు. కానీ ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది వ్యవసాయమే. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో వెయ్యి ఎకరాల్లో గ్రీన్హౌస్ సాగుపై ఐటీ ప్రొఫెషనల్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు’’అని అన్నారు. గొర్రెల పెంపకంతో సేంద్రీయ తెలంగాణ మాంసం కోసం హైదరాబాద్‌కు ప్రతిరోజూ 350 లారీల గొర్రెలను దిగుమతి చేసుకుంటున్నట్లు సీఎం చెప్పారు. ‘‘రాష్ట్రంలో 30 లక్షల మంది యాదవులుంటే గొర్రెలు దిగుమతి చేసుకోవడమేంటి? మేం గొర్రెల పంపిణీ చేపట్టి రూ.20 వేల కోట్ల సంపద సృష్టిస్తాం. గొర్రెల పెంపకంతో సేంద్రీయ తెలంగాణ సాధ్యం కానుంది. లక్షల టన్నుల ఎరువు వస్తుంది. దీంతో రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది. రైతులను, యాదవులను కలపాలి. నేను కూడా చిన్నప్పుడు తోడేలు రాకుండా గొర్రెల మంద దగ్గర కాపలాగా పడుకున్నా. నా గ్రీన్హౌస్లో ఇంగ్లిషు కుకుంబర్ వేస్తే 60 టన్నులు పండింది. ఫెస్టిసైడ్స్ వాడకాన్ని తగ్గించాలి. వ్యవసాయ యాంత్రీకరణ జరగాలి’’అని అన్నారు. 11 రాష్ట్రాల సీఎంలు ప్రశంసించారు రైతుకు పెట్టుబడి సాయంపై నీతి ఆయోగ్ సమావేశంలో 11 మంది సీఎంలు ప్రశంసించారని కేసీఆర్ తెలిపారు. ఇండియా టుడే సంచలనాత్మక నిర్ణయంగా అభివర్ణించిందన్నారు. ప్రధాని కూడా రూ.4 వేల సాయంపై తనతో చర్చించారన్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతి వృద్ధి రేటు 21 శాతంగా ఉందని, దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నామని చెప్పారు. ప్రతీ ఏడాది ఎంత లేదనుకున్నా 15 శాతం వృద్ధి రేటు ఉంటుందని ఆర్థికవేత్తలు తేల్చారన్నారు. అలా రూ.15–16 వేల కోట్ల వరకు నికరంగా ఖజానాలో ఉంటుందని, అందుకే రైతులకు పెట్టుబడి సాయం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. నాకు ఎవరితోనూ కొట్లాట లేదు.. ‘‘నా వయసు ఇప్పుడు 64. తెలంగాణ కావాలని అనుకున్నా.. వచ్చింది. ఇప్పుడు బంగారు తెలంగాణ కావాలి. నాకు ఎవరితోనూ పంచాయితీ లేదు.. కొట్లాట లేదు.. బతికున్న ఈ మిగిలిన కాలంలో తెలంగాణ పచ్చగా కళకళలాడుతుంటే, దుఃఖం లేని రైతు చిరునవ్వుతో ఉంటే చూడాలన్న కాంక్ష తప్పితే నాకు మరో ఆకాంక్ష లేదు. దయచేసి మీరు నా ఆకాంక్ష నెరవేర్చుతారని భావిస్తున్నా..’’సీఎం ఉద్వేగంగా అన్నారు. ప్రతిపక్షాలు ప్రతీ దానికి రాజకీయం చేస్తున్నాయన్నారు. ‘‘ఓట్లు, రాజకీయాలు అంటూ చిల్లర గొడవ చేస్తున్నారు. గెలిపిస్తే పనిచేయాలి... లేకుంటే ఇంట్లో పడుకోవాలి. అడుగేస్తే రాజకీయమేనా..?’’అని మండిపడ్డారు. ‘‘నేను యాదృచ్ఛికంగా సీఎంగా ఉండొచ్చు. నేను కాకపోతే ఎల్లయ్యో పుల్లయ్యో ఉంటాడు. అదేం విశేషం కాదు...’’అని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీలు వినోద్‌కుమార్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం వ్యవసాయ పంచాంగాన్ని ఆవిష్కరించారు. -
నరమాంసాన్ని వీధుల్లో అమ్మారు
మాస్కో: రష్యా ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాల్లో ఒకటి. అలాంటి రష్యా 19వ శతాబ్దంలో కనివినీ ఎరుగని కరువుతో కొట్టుమిట్టాడింది. రష్యన్లు అనుభవించిన ఈ నరకాన్ని 'పొవొల్జై' కరువు అని కూడా పిలుస్తారు. 1917లో రష్యా ఇంచార్జ్ గా లెనిన్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆహారంపై ఆంక్షలు విధించారు. దీంతో 1920లో రష్యాలో కీలక నదులైన వోల్గా, ఓరల్ నదీ పరివాహక ప్రాంతాల్లో తీవ్ర దుర్భిక్షం నెలకొంది. వేలాది మంది ప్రజలు క్షుద్భాద తో ప్రాణాలు విడిచారు. దాదాపు 2.5 కోట్ల మంది రష్యన్లు ఈ కరువులో ఆకలితో అలమటించి ప్రాణాలు విడిచారని ఓ అంచనా. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత రష్యాలో ప్రజా తిరుగుబాటు, కరువు, ప్రభుత్వ అసమర్ధతల వల్ల తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. ప్రజలు ఆకలితో చేసిన పనులు గురించి తెలుసుకుంటే కన్నీళ్లు ఆగవు. గడ్డి, కుక్కలు, పిల్లులు, తోలు వస్తువులు, పశువులను, మానవుల మలాలను కూడా తిన్నారు. కొంతమంది తల్లిదండ్రులైతే ఏకంగా తమ బిడ్డలను చంపి ఆకలి తీర్చుకున్నారు. 1921 నుంచి 1922 వరకూ సాగిన ఈ దుర్భిక్ష కాలంలో ప్రజలు నరమాంసాన్ని తినేందుకు అలవాటు పడ్డారు. వీధుల్లో నరమాంసాన్ని అమ్మే దుకాణాలు వెలిశాయి. మనుషులను చంపి వారి రక్తమాంసాలను కిలోల చొప్పున అమ్ముతున్నా పోలీసు వ్యవస్ధ, ప్రభుత్వం చూస్తూ ఉండిపోయాయి. ఆనాటి కకావికల దృశ్యాలను కొందరు కెమెరాల్లో బంధించారు. వీధుల్లో నరమాంసం అమ్ముతున్న దంపతులను, చర్మం ఎముకలకు అతుక్కుపోయి అస్థిపంజరాల్లా కనిపిస్తున్న పిల్లలు, వృద్ధులు, మహిళలను ఆ ఫొటోల్లో చూడవచ్చు. అప్పట్లో అవి పత్రికల్లో అచ్చుకావడంతో అమెరికా, కొన్ని యూరోప్ దేశాల ప్రభుత్వాలు స్పందించి వారికి ఆహారం, ఇతర సహాయ సహకారాలు అందించాయి. దీంతో, కొన్ని లక్షల మంది ప్రాణాలు నిలుపుకున్నారు. -
వానాకాలంలోనూ వలసలే..
♦ తప్పని బతుకుపోరు ♦ ఖేడ్‌ను వీడని కరువు ఛాయలు ♦ మూగజీవాలూ వలస బాట ♦ నిజాంసాగర్ వైపు పశువుల తరలింపు ♦ మొదలుకాని సాగు పనులు పాడి రైతులు ఆగం ♦ ఖరీఫ్‌పై ఆశలు ఆవిరే! వానాకాలంలోనూ ఖేడ్‌ను వీడని కరువు ఛాయలు... తాగేందుకు నీళ్లు లేక.. మేసేందుకు గ్రాసం దొరక్క మూగ జీవాలు విలవిల్లాడుతున్నాయి. వీటిని పోషించేందుకు పాడి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మంజీర ఎండిపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. సరైన వర్షాలు లేకపోవడంతో ఈసారి రైతులు ఇంకా సాగు పనులు మొదలు పెట్టలేదు. అడపాదడపా వర్షాల వల్ల ఉపయోగం లేకుండా పోయింది. పశువులను బతికించుకునేందుకు పాడి రైతు వలస బాట పడుతున్నాడు. నెలన్నర గడిచినా వానలు లేకపోవడంతో కాలం కలిసొచ్చేలా లేదంటూ రైతన్న కన్నీరు పెడుతున్నాడు. నారాయణఖేడ్ : మంజీర నది పూర్తిగా ఎండిపోయింది. భూగర్భ జలాలు అట్టడుగు స్థాయికి పడిపోయాయి. చుక్క నీటికీ కష్టంగానే ఉంది. వానా కాలంలోనూ పరిస్థితి మారలేదు. పశుపక్షాదులు మంచి నీటికోసం అవస్థ పడుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా వేసవిలో ప్రభుత్వం కల్హేర్ మండలం నల్లవాగు ప్రాజెక్టు వద్ద పశుసంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. పశువులకు దాణా, తాగునీటి ఇబ్బందులు తీర్చింది. పలు గ్రామాల రైతులు తమ పశువులను ఈ సంరక్షణ కేంద్రానికి తీసుకొచ్చారు. వర్షాకాలం ప్రారంభం కాగానే ఈ కేంద్రాన్ని ఎత్తివేయడంతో రైతులు తమ పశువులనుు స్వగ్రామాలు, తండాలకు తరలించుకెళ్లారు. వర్షాకాలం వచ్చినా వర్షాలు ముఖం చాటేశాయి. నెలన్నర గడుస్తున్నా వర్షాల జాడ లేదు. తుంపర్ల వర్షంతో కనీసం గడ్డికూడా మొలవలేదు. వర్షాభావం వల్ల గ్రామాల్లోని చెరువులు, కుంటలు ఎండిపోయే ఉన్నాయి. దీంతో తాగేందుకూ నీరు కరువైంది. రైతులు చేసేదిలేక మూగజీవాలను బతికించుకునేందుకు ఏటా వేసవిలో వెళ్లేలా నిజాంసాగర్ పరీవాహకానికి, బంజెపల్లికి వలస వెళ్తున్నారు. నిత్యం వందల సంఖ్యలో పశువులను తోడుకెళ్తున్నారు. బక్కచిక్కిన మూగజీవాలు.. గ్రాసం, నీటి సమస్య కారణంగా పశువులు బక్కచిక్కాయి. వాటి గోసను చూడలేక రైతులు గ్రాసం, నీరున్న చోటకు తోడుకెళ్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో గేదెలు 72,504, ఆవులు 83,684, గొర్రెలు 1,36,982, మేకలు 88,078 వరకు ఉన్నట్టు పశుసంవర్థకశాఖ అధికారుల అంచనా. ఇందులో సగానికిపైగా పశువులు వలసబాట పడుతున్నాయి. ఈ నెలాఖరు వరకు ఇలాగే వర్షాభావ పరిస్థితులుంటే మిగతా పశువులు సైతం వలస బాట పట్టాల్సిందే. పంటల సాగు ఇలా... నియోజకవర్గం మొత్తంలో 60,392 హెక్టార్లలో వివిధ రకాల సాధారణ సాగు కాగా గత ఏడాది 69,109హెక్టార్ల మేర పంటలు సాగుచేశారు. వర్షాలు సమృద్ధిగా ఉంటే ఈ సాగువిస్తీర్ణం మరింత పెరిగే అవకాశాలున్నాయి. కానీ వర్షాభావం ఫలితంగా చాలామంది రైతులు పెసర, మినుము, కంది పంటలు సాగు చేయలేకపోయారు. జూలై మొదటివారంలోగా ఈ పంటలు విత్తుకుంటేనే సరైనదిగుబడులు వస్తాయి. కానీ అదను దాటిపోయినా ఇంకా రైతులు వర్షాల కోసమే చూస్తున్నారు. భూముల్లో నాగలితో దున్నితే మూడు ఇంచులులోపు పొడిమట్టే వస్తుందని రైతులు చెబుతున్నారు. ఈ విత్తనాలు విత్తుకునేందుకు 50నుండి 60 మిల్లీమీటర్ల మేర భూమి తడిస్తేనే విత్తనం బతికి మొలకెత్తుతుందని, లేదా వేడికి చనిపోతుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. వర్షపాతం ఇలా... ఖేడ్ మండలంలో జూన్‌లో సాధారణ వర్షపాతం 122మి.మీ కాగా, 106 మి.మీ మాత్రమే కురిసింది. జూలై మాసంలో సాధారణ వర్షపాతం 221మి.మీ కాగా ఇప్పటివరకు 53 మి.మీ. మాత్రమే పడింది. కంగ్టి మినహా నియోజకవర్గంలోని ఖేడ్, మనూరు, పెద్దశంకరంపేట, కల్హేర్ మండలాల్లో వర్షపాతం పరిస్థితి ఇలాగే ఉంది. పొంచి ఉన్న వ్యాధులు... నిజాంసాగర్ ప్రాంతంలో ఇతర జిల్లాల పశువులు కూడా వస్తుండడంతో గొంతువాపు, గాలికుంటు వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉంది. ఏటా వసల వెళ్లిన పశువులు అంటువ్యాధుల బారిన పడి మరణించిన సంఘటనలూ చోటుచేసుకున్నాయి. నిండు వర్షాకాలంలోనూ వర్షాలు లేక పాడి పశువులు, పంటలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. -
బీమా లేదు..ధీమా లేదు
- ఎకరాకూ దక్కని వైనం - ముగిసిన పంట బీమా గడువు - అధికారుల వైఫల్యం - ఆందోళనలో అన్నదాతలు సాక్షి, విశాఖపట్నం: అన్నదాతలకు ధీమా లేకుండా పోతుంది. ఏటా విరుచుకుపడే ప్రకృతి వైపరీత్యాలు..కరువు కాటకాల బారినపడే పంటలకు బీమా లేకుండా పోతుంది. ప్రభుత్వ ఉదాశీనత, శాఖల మధ్య సమన్వయ లోపం..ముఖం చాటేస్తున్న బ్యాంకర్ల పుణ్యమాని ఏ ఒక్క రైతు బీమా పొందలేని పరిస్థితి ఉంది. ప్రకృతి వైపరీత్యాల బారిన పడి నష్టపోయిన రైతుకు వెన్నదన్నుగా నిలిచేందుకు బీమా పథకం నేడు అక్కరకు రాకుండా పోతోంది. గతేడాది హుద్‌హుద్ వల్ల సర్వం తుడుచుకుపెట్టుకుపోయినా ఇన్‌పుట్‌సబ్సిడీ వచ్చిందే కానీ బీమా రాలేదు. ఈ పథకం పట్ల రైతుల్లో ఆశించిన స్థాయిలో ఆసక్తి లేకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుత ఖరీఫ్‌లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఒక్క ఎకరానికీ బీమా వర్తించలేదు. ఏరైతూ బీమా ప్రీమియం చెల్లించలేని దుస్థితి ఏర్పడడం ఇదే తొలిసారి అని అధికారులే అంగీకరిస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం 5,12,285 ఎకరాలు. ఇందులో 2,57,670 ఎకరాల్లో వరి, 94,570 ఎకరాల్లో చెరుకు, 56,535 ఎకరాల్లో రాగి పంటలు సాగు చేస్తుండగా, ఇతర పంటలన్నీ మరో 1,3,510 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. చెరకుతో పాటు వరిపంటలకు మాత్రమే పంట బీమా వర్తిస్తుంది. ఈ రెండింటి విస్తీర్ణమే మూడొంతులుంటుంది. 80 శాతం మంది ఈ పంటలే పండిస్తుంటారు. అయినా సర్కార్ పంట బీమా పథకం అమలు పట్లపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శి స్తోంది. నాలుగేళ్లుగా కవరైన సాగు విస్తీర్ణమే ఇందుకు నిదర్శనం. 2014-15లో అతి కష్టమ్మీద 3 వేల ఎకరాల విస్తీర్ణానికి మాత్రమే బీమా కల్పించారు. ఈ ఏడాది ఒక్క ఎకరాకు కూడా బీమా కల్పించ లేదు. ఒక్క రైతు కూడా ఒక్కరూపాయి ప్రీమియం చెల్లించలేదు. వరికైతే ఎకరాకు పెద్దరైతు రూ.522లు, సన్నకారు రైతు 470లు, చెరకుకైతే రూ.2806, రూ.2229, మొక్క జొన్న కైతే రూ.277లు, రూ.249 చొప్పున ప్రీమియం చెల్లించాలి. జూలై-31తో గడువు ముగిసినా ఎవరూ ప్రీమియం చెల్లించిన వైనం లేదు. హుద్‌హుద్ విరుచుకుపడిన గతేడాదితో సహా గడిచిన నాలుగేళ్లలో బీమా చేయించుకున్న ఏ ఒక్క రైతుకు ఒక్క ఎకరాకు కూడా బీమా సొమ్ము విడుదల కాలేదు. 2012-2014 మధ్య పంటల బీమా చేయించుకున్న రైతులకు సుమారు రూ.8కోట్ల మేర బీమా మొత్తం రావాల్సి ఉంది. ఒక్క పైసా విడుదల కాకపోవడం కూడా రైతుల్లో ఈపథకం పట్ల నిరాశ కలిగించింది. రైతులను చైతన్య పర్చడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. ఎకరాకు ఎంత కట్టాలి..ఎప్పటిలోగా చెల్లించాలి అనేది ఏ వ్యవసాయాధికారి మా వద్దకు వచ్చి చెప్పిన పాపానపోలేదని రైతులు వాపోతున్నారు. కరువుఛాయలు తరుముకొస్తున్నాయి. మరొక పక్క రోజుకో వాయుగుండం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఇటువంటి తరుణంలో ఏ దశలో పంట ను కోల్పోవల్సి వస్తుందో తెలియని పరిస్థితి. -
చుట్టపు చూపే!
- కరువు బృందాలతో ఒరిగింది శూన్యం - మారని ‘అనంత’ రైతుల బతుకులు - కరువు తీవ్రతను గుర్తించినా సహాయక చర్యలు చేపట్టని ప్రభుత్వాలు - ఏటా రూ.వందల కోట్లతో ఇస్తున్న జిల్లా కరువునివేదికలు బుట్టదాఖలు - నేడు జిల్లాకు కేంద్ర విపత్తు నివారణ కమిషనర్ రాఘవేంద్రసింగ్ బృందం అనంతపురం అగ్రికల్చర్: ‘అనంత’ కరువు కాటకాలను కళ్లారా చూసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతస్థాయి అధికారులతో కూడిన కరువు బృందాలు ఏటా వచ్చివెళుతున్నా జిల్లా రైతుల తలరాతలు మారడం లేదు. వచ్చివెళుతున్న బృందాలు జిల్లాలో అనావృష్టి పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని గుర్తిస్తున్నా... కరువు రక్కసి నుంచి ‘అనంత’ను శాశ్వతంగా విముక్తి చేసే చర్యలు మాత్రం చేపట్టడం లేదు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని రూ.వందల కోట్లతో జిల్లా అధికారులు సమర్పిస్తున్న నివేదికలు బుట్టదాఖలవుతున్నాయి. ఉన్నత స్థాయి అధికారులతో కూడిన రెండు బృందాలు సంవత్సరానికి రెండు దఫాలుగా వచ్చి జిల్లాలో నెలకొన్న దారుణమైన కరువు పరిస్థితులు, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రైతులను పలకరిస్తూ, పంటల స్థితిగతులపై పరిశీలనాత్మక అధ్యయనం చేసి వెళుతున్నారు. ఏటా ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల నడుమ సాగు చేసిన 9 లక్షల హెక్టార్ల ఖరీఫ్ పంటలకు పెట్టిన పెట్టుబడులు కూడా రైతులు దక్కించుకోలేక పోతున్నారు. సంవత్సరానికి జిల్లా రైతులు రూ.4 నుంచి రూ.5 వేల కోట్లు పంట ఉత్పత్తులు నష్టపోతూ ఆర్థికంగా పీకల్లోతుకు కూరుకుపోతున్న విషయం తెలిసిందే. జిల్లాలో విస్తరించిన 1.10 లక్షల హెక్టార్ల పండ్లతోటల రైతులదీ అదే పరిస్థితి. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో కన్నబిడ్డల్లా పెంచుకున్న పండ్లతోటలు నిలువునా ఎండుతున్నాయి. అకాల వర్షాలకు నేలవాలిపోతున్నాయి. లక్షలు వెచ్చించి కొత్తగా బోర్లు తవ్విస్తున్నా నూటికి ఒకట్రెండు బోర్లలో మాత్రమే నీళ్లు వస్తున్నాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాత్రం కంటితుడుపుగా ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సూరెన్స్ కింద రైతుల చేతుల్లో చిల్లర పడేస్తున్నారు తప్పితే రైతు కుటుంబాలను గట్టెక్కించే ప్రయత్నాలు చేయడం లేదు. ప్రభుత్వం మాత్రం ఏటా అనంతపురం జిల్లాలో ఉన్న 63 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తున్నా ప్రయోజనం శూన్యం. ఈ ఏడాది వర్షం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పంటలు సాగులోకి రాక, చేసిన అప్పులు తీర్చలేక, ఆర్థిక సమస్యలతో దిక్కుతోచని రైతులు బలవణ్మరణాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 85 మంది రైతులు అర్ధంతరంగా తనవు చాలించారు. ఈ క్రమంలో షరామూమూలు అన్నట్లుగా మరో కేంద్ర బృందం సోమవారం జిల్లా పర్యటనకు రానుంది. కేంద్ర కరువు, విపత్తు నివారణ కమిషనర్ రాఘవేంద్ర సింగ్, కేంద్ర హార్టికల్చర్ డెరైక్టర్ అతుల్పాట్నే, రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్ ఉషారాణితో పాటు మరికొందరు అధికారుల బృందం పెనుకొండ, చెన్నేకొత్తపల్లి ప్రాంతాల్లో పర్యటిస్తుండటంతో జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది. కాలగర్భంలోకి కమిటీ సిఫారసులు భారత వ్యవసాయ పరిశోధనా కేంద్రం (ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ డాక్టర్ అయ్యప్పన్ సారథ్యంలోని 18 మంది నిపుణులతో కూడిన ‘హైపవర్ టెక్నికల్ కమిటీ’ 2012 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో రెండు దఫాలు జిల్లాలో విసృ్తతంగా పర్యటించింది. డాక్టర్ అయ్యప్పన్ కమిటీ చేసిన సిఫారసుల మేరకు రూ.7,676 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘ప్రాజెక్టు అనంత’ అనే కరువు నివారణ పథకాన్ని అనతికాలంలోనే కాలగర్భంలోకి కలిపేశారు. 2013 ఏప్రిల్ 18న ఎఫ్‌సీఐ రాష్ట్ర జనరల్ మేనేజర్ కళ్యాణచక్రవరి నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారుల బృందం చిలమత్తూరు, లేపాక్షి, గోరంట్ల, ఓడీసీ, కదిరి మండలాల్లో పర్యటించింది. తక్షణసాయం కోసం జిల్లా అధికారుల బృందం రూ.1,065 కోట్లు కావాలని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేసింది. 2013 డిసెంబర్లో కేంద్రానికి చెందిన కమిషన్ ఫర్ సెంట్రల్ క్రాప్స్ అండ్ ప్రైసెస్ కమిషనర్ అశోక్‌గులాటే బృందం జిల్లాలో పర్యటించి పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరల గురించి ఆరాతీసింది. 2014 ఏప్రిల్ 22, 23 తేదీల్లో ‘ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం’ పేరుతో మరోసారి కేంద్ర బృందం జిల్లా పర్యటన చేసింది. కదిరి, ముదిగుబ్బ, అనంతపురం, ఆత్మకూరు, కళ్యాణదుర్గం మండలాల్లో పర్యటించి కరువు పరిస్థితులను కళ్లారా చూసి చలించిపోయారు. తక్షణం రూ.1,147.50 కోట్లు అవసరమని జిల్లా అధికారులు నివేదిక అందజేశారు. అనంతరం 2015 ఏప్రిల్ 1న కేంద్ర వ్యవసాయశాఖ జాయింట్ సెక్రటరీ షకీల్‌అహ్మద్ నేతృత్వంలో మరో బృందం జిల్లాలో పర్యటించింది. వచ్చిన అధికారులు రెండు బృందాలుగా విడిపోయి హిందూపురం, ఓడీ చెరువు, అమడగూరు, పెనుకొండ, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి మండలాల్లో కరువు పరిస్థితులను చూశారు. జిల్లా యంత్రాంగం తరపున రూ.1,404 కోట్లు తక్షణసాయం కావాలని సమగ్ర నివేదిక అందజేశారు. ఇలా... ఏటా కేంద్ర బృందాలు రావడం, వచ్చిన అధికారులు కరువును తిలకించి చలించిపోవడం మినహా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదుకునే చర్యలు చేపట్టకపోవడంతో రైతులు దుర్భిక్షంలో కొట్టుమిట్టాడుతున్నారు. -
రైతన్నను కబళించిన కరువు
సైదాపురం: జిల్లాలో మూడేళ్లుగా నెలకొన్న కరువు రక్కసి రైతన్నలను కబళిస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వర్షాలు లేక పొలాలన్నీ బీడుగా మారాయి. సేద్యం తప్ప మరో పని తెలియని అన్నదాతలు ఏరోజుకారోజు వర్షం కురుస్తుందని ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. భూగర్భ జలాలు సైతం అడుగంటిపోయాయి. చెరువులన్నీ చుక్కనీరు లేక ఒట్టిపోయాయి. బోర్ల కిందైనా పంటలు సాగు చేద్దామని సాహసం చేసిన రైతులు చివరికి తీవ్రంగా నష్టపోయారు. ఆత్మహత్య చేస్తున్న చాగణం గ్రామానికి చెందిన రైతు మోడిబోయిన కృష్ణయ్య అప్పులుజేసి రెండేళ్లలో తన మూడెకరాల పొలంలో 20 బోర్లు వేసినా గంగ జాడ కన్పించలేదు. ట్యాంక్‌లతో కూడా తాను సాగు చేసిన మిరప పొలానికి నీరు పెట్టారు. రెండు రోజుల కిందట కూడా చివరి ప్రయత్నంగా మరో బోరు వేసినా ఫలితం లేకుండా పోయింది. విసిగిపోయిన కృష్ణయ్య చేసేది లేక మిన్నకుండిపోలేదు. బోర్లు వేసేందుకు చేసిన లక్షలాది రూపాయలు అప్పులు తీర్చే దారి లేక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. భోగి పండగ రోజు కుటుంబసభ్యులందరినీ ఇంటికి పిలిచి అందరితో ఆనందంగా మాట్లాడారు. మిరపతోటకు వెళ్లి వస్తానని చెప్పి అక్కడే తనువు చాలించారు. కృష్ణయ్యకు భార్య రాజమ్మ, ఇద్దరు కుమారులు, కుమారుడు ఉన్నారు. కుమార్తెలిద్దరికీ వివాహం చేశారు. అద్దె ఇంట్లోనే ఆయన కుటుంబం జీవిస్తుంది. పండగకు ఇద్దరు కుమార్తెలతో పాటు అల్లుళ్లను కూడా పిలుచుకున్నారు. కుమారుడు బెంగళూరులో చిన్న పనులు చేసుకుంటూ బతుకుతున్నారు.ఆయన కూడా పండగకి ఇంటికి చేరుకున్నారు. కుటుంసభ్యులు, గ్రామస్తులంతా కృష్ణయ్య మృతదేహం వద్ద బోరున విలపించారు. తమకు దిక్కెవరయ్యా అంటూ భార్య రాజమ్మ విలపిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది. బాడుగ ఇంట్లో కాపురం ఉండటంతో మృతదేహంను అక్కడ కాకుండా సొంత తమ్ముడి ఇంట్లో ఉంచాల్సి వచ్చింది. పండగ పూట ఆ కుటుంబంతోపాటు గ్రామంలో తీవ్రమైన విషాదఛాయలు అలముకున్నాయి. -
కరువు
సాక్షి, మంచిర్యాల : జిల్లాను కరువు దుర్భిక్షం అలుముకుంది. నాలుగు నెలలుగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో సాగు సంక్షోభంలో పడింది. కరుణించని వరుణుడు.. కనికరించని కరెంటు అన్న చందంగా ఈ ఖరీఫ్ కూడా రైతులకు నష్టాలనే మిగిల్చింది. తానూరులో అతి తక్కువగా -68 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. దీంతోపాటు 46 మండలాల్లో లోటు వర్షం కురిసింది. లోటు వర్షపాతంతో ఇప్పటికేపంట దిగుబడులు భారీగా తగ్గాయి. వరి పంట ఎక్కువగా దెబ్బతింది. మొక్కజొన్న, కందుల దిగుబడి తగ్గే పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాభావం దృష్ట్యా మరో పది రోజుల్లో మిగిలిన పంటలూ ఎండిపోయే ప్రమాదముందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. నమోదైన వర్షపాతం.. భూగర్భ జలమట్టం.. సాగు విస్తీర్ణం.. పంట నష్టం.. సాగునీరు.. విద్యుత్తు కోతలకు సంబంధించిన నివేదికను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. మరోపక్క.. ఈ నెల నుంచి ప్రారంభంకానున్న రబీ సీజన్ ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు పంటలు వేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో పంట దిగుబడి మరింత తగ్గే ప్రమాదముంది. వర్షపాతం ఇలా.. జూన్ నుంచి గురువారం వరకు సాధారణ వర్షపాతంతో పోలిస్తే జిల్లాలో 33 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. మొత్తం 52 మండలాల్లో ఇచ్చోడ, బజార్హత్నూర్, బెజ్జంకి, నెన్నెల, వేమనపల్లి మినహా అన్ని మండలాలను వర్షాభావం వెంటాడింది. ఈ మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. 46 మండలాల్లో 20 శాతం నుంచి 59 శాతం తక్కువ వర్షపాతం కురిసింది. తానూరు మండలంలో అతి తక్కువగా వర్షపాతం నమోదైంది. కుభీర్, ఇంద్రవెల్లిలో సాధారణం కంటే 50 శాతం లోటు వర్షపాతం ఉంది. పడిపోయిన భూగర్భ జలాలు..! క్రమంగా పడిపోతున్న భూగర్భ జల మట్టాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 11 మండలాల్లో భూగర్భ జలం పది మీటర్ల లోతుకు చేరుకున్నట్లు భూగర్భ జల అధికారులు నిర్ధారించారు. ప్రధానంగా ఆదిలాబాద్, ఉట్నూర్, ఆసిఫాబాద్ డివిజన్లోని పలు మండలాల్లో భూగర్భ జలం ప్రమాదకర స్థాయికి పడిపోతోంది. తాజా దుస్థితిని విశ్లేషిస్తూ భూగర్భ జల శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్ కోటా లేకపోవటంతో వ్యవసాయానికి ఇచ్చే ఐదు గంటల్లోనూ కోత పెడుతున్నారు. మరోవైపు జిల్లాలో సాగు విస్తీర్ణం తగ్గిపోవటంతోపాటు పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు కాపాడుకోవటానికి వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తగిన సలహాలు సూచనలు అందించినా పంటలు మాత్రం ఎండు ముఖమే పట్టాయి. కరువు పరిస్థితులపై ప్రభుత్వాన్ని నివేదించాం.. - రోజ్‌లీలా, వ్యవసాయ శాఖ, జాయింట్ డెరైక్టర్ జిల్లా అంతటా కరువు ఉంది. ఇప్పటికే పంటలు ఎండిపోయాయి. వారం రోజుల్లో మరిన్ని పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. కరువు పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం.