వాతావరణం మారిపోతోంది... అకాల వర్షాలు, వరదలు సాధారణమైపోతున్నాయి. ఈ నేపథ్యంలో మొక్కలు అతి తక్కువ నీటితోనూ బతికేయగలిగేందుకు ఉపకరించే ఓ హార్మోన్‌ను జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. నేలలో తేమ తక్కువగా ఉన్నప్పుడు సీఎల్‌ఈ 25 పెప్టైడ్ వేళ్లను వదిలి ఆకుల్లోకి చేరిపోతుంది. దాంతోపాటు ఆకుల ఉపరితలంపై ఉండే రంధ్రాలు మూసుకుపోయేలా చేసి మొక్కలోని నీరు ఆవిరైపోకుండా కాపాడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మనుషుల్లోనూ ఇలాంటి పెపై్టడ్‌లు ఉంటాయని.. శరీరం వాతావరణ పరిస్థితులకు తట్టుకుని నిలిచేందుకు ఇవి ఉపయోగపడతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త టకహషి అంతున్నారు.
మొక్కల్లోనూ ఇలాంటి వాటి కోసం పరిశోధనలు చేపట్టగా తమకు సీఎల్‌ఈ 25 గురించి తెలిసిందని చెప్పారు. రకరకాల సీఎల్‌ఈ పెప్టైడ్‌లను మొక్కల వేళ్లకు అందించి చూసినప్పుడు.. నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు సీఎల్‌ఈ25 ఒక్కటే ఆకుల్లోకి చేరుతున్నట్లు తాము గుర్తించామని వివరించారు. ఏబీఏ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా ఈ పెప్టైడ్ రంధ్రాలను పూడుస్తున్నట్లు తెలిసింది. ఈ పరిశోధనల ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోగల కొత్త వంగడాల తయారీకి వీలేర్పడుతుందని అంచనా.
కరవును తట్టుకునే హార్మోన్ ఇదే..
Published Fri, Apr 6 2018 12:23 AM | Last Updated on Fri, Apr 6 2018 12:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment