BJP Leader Says, Is This Bengal Or Russia-Ukraine? - Sakshi
Sakshi News home page

బెంగాల్ పంచాయతీ ఎన్నికల నామినేషన్లో ఉద్రిక్తత.. 

Published Wed, Jun 14 2023 5:50 PM | Last Updated on Wed, Jun 14 2023 6:42 PM

BJP Leader Says This Is Bengal Or Russia Ukraine - Sakshi

కోల్కతా: బెంగాల్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రమంతా వేడెక్కింది. తాజాగా బంకూర్లో నామినేషన్ దాఖలు చేస్తుండగా బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో అక్కడే ఉన్న కేంద్ర బలగాలు వారిని కట్టడి చేసి అక్కడి నుండి తరిమేస్తున్న దృశ్యాలను ఓ మీడియా ఛానల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సందర్బంగా మేము బెంగాల్లో ఉన్నామా? లేక రష్యా, ఉక్రెయిన్లో ఉన్నామా? అని ప్రశ్నించారు బీజేపీ నేత అగ్నిహోత్రి పాల్. 

పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అక్కడక్కడా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలన్న ఉద్దేశ్యంతో సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించమని ఆదేశాలను జారీ చేసింది కోల్కతా హైకోర్టు. అందులో భాగంగా మిడ్నపూర్, జల్పైగురి, బిర్భుమ్, ఉత్తర 24 పరాగణాస్, దక్షిణ 24 పరాగణాస్, హుగ్లీ, ముర్షిదాబాద్ జిల్లాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. బీజేపీ నేతలు సువెందు అధికారి, అధిర్ రంజన్ చౌదరిల అభ్యర్ధన మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అదనంగా అన్నిచోట్లా సీసీటీవీ కెమెరాలు కూడా అమర్చమని ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది. 

బంకూర్లో నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న సందర్బంగా భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ గుమికూడారు. నామినేషన్ దాఖలు చేస్తుండగానే రెండు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంతలో కేంద్ర బలగాలు అప్రమత్తమై వారిని చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. 

ఓ మీడియా సంస్థ ఈ ఘర్షణల వీడియోని ట్విట్టర్ ద్వారా అందరికీ చూపించింది.. ఇందులో కేంద్ర బలగాలు ఘర్షణ జరుగుతున్నా చోటికి పరుగులు తీసి బీజేపీ జెండాలు పట్టుకున్న కార్యకర్తలను చెదరగొడుతూ ఉన్నారు. ఈ సందర్బంగా బీజేపీ నేత అగ్నిహోత్రి పాల్ మాట్లాడుతూ మా కార్యకర్తలపై బాంబులు వేసిన తీరు చూస్తే మేము రష్యాలోనో ఉక్రెయిన్లోనో ఉన్నట్టనిపిస్తోందని అన్నారు. 

ఇది కూడా చదవండి: లుంగీలు, నైటీలపై తిరగొద్దు.. చూడలేకపోతున్నాం!          

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement