టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. షమీ భారతీయ జనతా పార్టీ తరపున పశ్చిమ బెంగాల్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ పెద్దలు షమీతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. బెంగాల్‌లోని బసిర్‌హత్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి షమీని బరిలోకి దించాలని బీజేపీ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
అయితే షమీ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా బెంగాల్ క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే బెంగాల్ మాజీ క్రికెటర్లు మనోజ్ తివారీ, అశోక్ దిండా రాజకీయాల్లో ఉన్నారు. తివారీ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండగా.. దిండా బీజేపీ శాసన సభ్యునిగా ఉన్నాడు. కాగా షమీ ప్రస్తుతం లండన్‌లో ఉన్నాడు. చీలమండ గాయం నుంచి కోలుకుంటున్నాడు.
ఇటీవలే తన మడమ గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీ తర్వాత వేగంగా కోలుకోవాలని ప్రధాని మోదీ సైతం షమీకి విషెస్ కూడా చెప్పారు. దీంతో షమీ రాజీకీయాల్లోకి రావడం ఫిక్స్ అయిపోయిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే షమీ ఒక వేళ రాజకీయాల్లోకి వస్తే అతడి అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లే. ఎందుకంటే గతంలో కూడా చాలా మంది క్రికెటర్లు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత.. అంతర్జాతీయ క్రికెట్‌లో యాక్టివ్‌గా లేరు.
షమీగా లోక్‌సభ ఎన్నికలో పోటీచేయాలని భావిస్తే అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికే ఛాన్స్ ఉంది. షమీ ప్రస్తుతం భారత క్రికెట్‌లో కీలక బౌలర్‌గా కొనసాగుతున్నాడు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో షమీ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. 24 వికెట్లతో టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అయితే వన్డే వరల్డ్‌కప్ తర్వాత షమీ తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యాడు.
చదవండి: IND vs ENG: ఎందుకంత ఓవరాక్షన్ బాబు.. నీకు రోహిత్ చేతిలో ఉందిలా! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment