
రంజీ ట్రోపీ 2022 సీజన్‌లో బెంగాల్ క్రీడాశాఖ మంత్రి మనోజ్ తివారి మరో సెంచరీతో మెరిశాడు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న సెమీస్ పోరులో మనోజ్ తివారి కీలక సమయంలో శతకం సాధించాడు. 12 ఫోర్ల సాయంతో సెంచరీ సాధించిన మనోజ్ తివారి.. శతకం అందుకున్న వెంటనే 102 పరుగుల వద్ద శరన్ష్ జైన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
మనోజ్ తివారీకి సహకరించిన షాబాజ్ అహ్మద్ కూడా సెంచరీతో మెరవడం విశేషం. 209 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 116 పరుగులు చేసిన షాబాజ్ అహ్మద్ ఔట్ కాగానే బెంగాల్ వెనువెంటనే వికెట్లు కోల్పోయింది. దీంతో బెంగాల్ తొలి ఇన్నింగ్స్ 273 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో మధ్యప్రదేశ్‌కు 68 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన మధ్యప్రదేశ్ ఒక వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది.
చదవండి: '14 ఏళ్ల వయసులో క్యాన్సర్‌ను జయించి.. అరంగేట్రంలోనే సెంచరీతో