
మౌమితా సాహా (పాత చిత్రాలు)
కోల్‌కతా : బెంగాలీ బిజీ సీరియల్ ఆర్టిస్ట్ మౌమితా సాహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం కోల్‌కతాలోని రీజెంట్ పార్క్‌లో ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఆమె ఉరి వేసుకున్నారు.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మౌమితా(23) ఆ అపార్ట్‌మెంట్‌లో గత కొద్ది నెలలుగా ఆమె ఒంటరిగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె అరడజనుకు పైగా సీరియళ్లలో నటిస్తున్నారు. బిజీ ఆర్టిస్ట్ అయినప్పటికీ ఆమె ఆత్మహత్యకు ఎందుకు పాల్పడిందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే గత కొంత కాలంగా ఆమె మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు స్నేహితులు చెబుతున్నారు. తన సోషల్ మీడియాలో వైరాగ్యపు పోస్టులు చేసినట్లు తెలుస్తోంది. అనుమానాదాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు కాల్ లిస్ట్ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment