
కోల్‌కతా: రంజీ ట్రోఫీలో కర్ణాటక తుదిపోరుకు చేరాలంటే 352 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలి. బెంగాల్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో సోమవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక రెండో ఇన్నింగ్స్‌లో 38 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలుండగా... చేతిలో 7 వికెట్లున్న కర్ణాటక 254 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు 72/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బెంగాల్ 161 పరుగుల వద్దే ఆలౌటైంది. రాజ్‌కోట్‌లో జరుగుతున్న మరో సెమీస్‌లో గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో సౌరాష్ట్రకు 52 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన సౌరాష్ట్ర ఆట నిలిచే సమయానికి 29 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 66 పరుగులే చేసింది.
Comments
Please login to add a commentAdd a comment