వ్యభిచార ముఠా గుట్టు రట్టు | The prostitution gang caught | Sakshi
Sakshi News home page

వ్యభిచార ముఠా గుట్టు రట్టు

Published Thu, Feb 22 2018 6:31 PM | Last Updated on Thu, Feb 22 2018 6:31 PM

The prostitution gang caught - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కోల్‌కత్తా : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తోన్న ఓ ముఠాను సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఐడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ ఘటనలో నలుగురు మహిళలకు, ఇద్దరు మైనర్‌ బాలికలకు పోలీసులు విముక్తి కల్పించారు. వీరి చేత కోల్‌కత్తాలోని డండం ప్రాంతంలో వ్యభిచారం చేయించేందుకు నిర్వాహకులు తీసుకువచ్చారు. ఈ విషయం తెలిసి బెంగాల్‌ సీఐడీ ఆఫీసర్లు దాడులు నిర్వహించడంతో విషయం బయటపడింది. 12 మంది నిర్వాహకుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.

నిర్వాహకులంతా బెంగాల్‌లోని వివిధ జిల్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఒక్క చోట చేరి తేలికగా డబ్బులు సంపాదిద్దామని ఈ వ్యాపారంలోకి దిగినట్లు చెప్పారు. వ్యభిచార నిర్వాహకుల నుంచి రూ.2.28 లక్షల నగదు, ఓ కారు స్వాధీనం చేసుకుని వ్యభిచారం జరిగిన హోటల్‌ను సీజ్‌ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement