prostistute
-
మీకెందుకు భయం.. మీ పని అదేగా.. సుశాంత్ సోదరి సంచలన ఆరోపణలు
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి ప్రియాంక సింగ్ సంచలన ఆరోపణలు చేసింది. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిపై తీవ్రస్థాయిలో ఫైరయింది. నువ్వు ఒక వేశ్య అంటూ రియాను ఉద్దేశించి హిందీలో ట్వీట్ చేసిందామె. సోమవారం రియా తాను సినిమాల్లో నటిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రియాంక సింగ్ ఆగ్రహాం వ్యక్తం చేసింది. రియా వెనక పాలకులు ఉన్నందుకే భయపడట్లేదని ప్రియాంక ఆరోపిస్తోంది. ప్రియాంక ట్వీట్లో రాస్తూ.. 'మీరు ఎందుకు భయపడతారు? మీ చేసే వేశ్య వృత్తిలో ఉన్నారు. ఎప్పటికీ అందులోనే కొనసాగుతారు. మీకు మద్దతు ఇస్తున్న పాలకులను చూసే నీకంత ధైర్యం' అంటూ పోస్ట్ చేసింది. సుశాంత్ కేసు విచారణలో ఆలస్యానికి బాధ్యులెవరో తనకు తెలుసని ప్రియాంక పేర్కొంది. అయితే కాసేపటికే తాను ప్రత్యేకంగా ఎవరినీ ఉద్దేశించి ట్వీట్ చేయలేదని స్పష్టం చేసింది. కాగా.. సోమవారం రియా చక్రవర్తి తిరిగి రోడీస్ 19 షోలో నటిస్తున్నట్లు ప్రకటించింది. 'పోయినా వారు ఎలాగో తిరిగి రారు.. కానీ ఇప్పుడు ఎందుకు భయపడాలి? అలా భయపడేవారు వేరేలా ఉంటారు' అంటూ రియా మాట్లాడింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో అతని గర్ల్‌ఫ్రెండ్ రియాపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె జైలుకు కూడా వెళ్లి వచ్చారు. సూసైడ్‌కు ముందు సుశాంత్, రియా రిలేషన్ షిప్లో ఉన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020న తన బాంద్రా నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే అతని కుటుంబసభ్యులు ఆత్మహత్యకు ప్రేరేపించేలా చేసిందంటూ రియాపై కేసు నమోదు చేశారు. రియా బెయిల్‌పై విడుదలైనప్పటికీ సీబీఐ, ఈడీ, ఎన్సీబీ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. तुम क्यूँ डरोगी? तुम तो व्यश्या थी, हो, और रहोगी! प्रशन् ये है कि तुम्हारे उपभोगता कौन है? कोई सत्ताधारी ही ये हिम्मत दे सकता है। WhoResponsible 4Delay InSSRCs is obvious — Priyanka Singh (@withoutthemind) April 10, 2023 -
కోల్‌కతా మీదుగా వేశ్యావాటికలకు రవాణా
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మానవ అక్రమరవాణా ముఠాలు నగరానికి తీసుకువచ్చే బంగ్లాదేశ్ యువతుల విషయంలో పక్కా పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయి. భారత్‌లోకి తీసుకొచ్చాక.. కొన్నాళ్లు కోల్‌కతాలో ఉంచి వీరికి గుర్తింపు కార్డులు సృష్టిస్తున్నారు. అమాయక మహిళలను అక్రమంగా సరిహద్దులు దాటించి దేశంలోకి తీసుకురావడం, హింసించడం, వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. ఈ మానవ అక్రమరవాణా ముఠాలో కొందరు పేరుకు భారతీయులుగా కనిపిస్తున్నా.. వారి మూలాలు బంగ్లాదేశ్‌లో ఉంటాయి. అంటే చాలా దశాబ్దాల క్రితమే అక్రమంగా దేశంలోకి ప్రవేశించి ఉంటారు. బంగ్లాలోని తమవారితో ఇంకా సంబంధాలు కొనసాగిస్తూ దందా నడుపుతున్నారు. అమ్మాయిలను అక్రమరవాణా చేసే సూత్రధారులు, వ్యభిచార గృహ నిర్వాహకులు, బాధిత యువతులు అంతా బంగ్లాదేశీయులే కావడం గమనార్హం. 2019లో బయటపడ్డ పహాడీషరీఫ్ సెక్స్‌రాకెట్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన దంపతులు సూత్రధారులు కాగా, తాజాగా వెలుగులోకి వచి్చన అబ్దుల్లాపూర్‌మెట్ ఘటనలోనూ సూత్రధారి లిటన్ సర్కార్‌ది బంగ్లాదేశే. బోర్డర్ నుంచి రాత్రికి రాత్రే కోల్‌కతాకు... భారతదేశానికి అక్రమంగా రవాణా చేసే యువతుల్లో ఎక్కువగా బంగ్లాదేశ్ దక్షిణ భాగానికి చెందిన వారే ఉండటం గమనార్హం. వీరు ఇండియాకు సమీపంలో ఉండటం, బంగ్లా దక్షిణాన రోహింగ్యాలు ఉండటం కూడా ఈ మాఫియాకు కలిసివస్తోంది. బెంగాల్లో దక్షిణభాగాన ఉన్న ‘ఉత్తర 24 పరగణా’జిల్లా ద్వారా అక్రమంగా యువతులను దేశంలోకి తీసుకువస్తారు. అక్కడ నుంచి కోల్‌కతా కేవలం ఎనభై కిలోమీటర్ల దూరం మాత్రమే. అర్ధరాత్రి మన భూభాగంలోకి వచ్చి ఉదయానికల్లా కోల్‌కతా చేరుకోవచ్చు. అక్కడి మురికివాడల్లో వీరిని కొంతకాలం ఉంచుతారు. నయానో.. భయానో వీరిని తమ దారికి తెచ్చుకుంటారు. ఎదురు తిరిగితే హింసిస్తారు. పైగా దేశంకాని దేశంలో అరెస్టు చేయిస్తామని, జైల్లో పెట్టిస్తామని భయపెడతారు. అలా వీరిని వ్యభిచార కూపంలోకి దింపుతారు. అక్కడే వీరికి పేర్లు మార్చి, స్థానికులుగా చెలామణి అయ్యేందుకు గుర్తింపుకార్డులు, సిమ్‌కార్డులు సిద్ధం చేస్తారు. అందుకే, వీరు దేశంలో ఎక్కడ పట్టుబడ్డా.. బెంగాల్ గుర్తింపుకార్డులే లభిస్తాయి. 2019 సెపె్టంబరులో హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్‌లోనూ వేశ్యావాటికపై పోలీసులు దాడులు చేయగా.. విటులు, నిర్వాహకులతోపాటు నలుగురు అమాయక బంగ్లా యువతులు పట్టుబడ్డారు. వారి వద్ద పలు భారత గుర్తింపుకార్డులు, సిమ్‌కార్డులు, స్మార్ట్ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. విదేశీయుల వద్ద భారత గుర్తింపు కార్డులు దొరకడం సంచలనం రేపింది. ఈ కేసు ఎన్ఐఏకు బదిలీ అయింది. తాజాగా అబ్దుల్లాపూర్‌మెట్ సెక్స్‌రాకెట్‌లోనూ బాధిత మహిళల పేర్లు మార్చి భారతీయులుగా చెలామణి చేసినట్లు రాచకొండ పోలీసులు గుర్తించారు. అనాథలు, పేదలు, రోహింగ్యాలు.. భారతదేశంలోని వేశ్యావాటికల్లో యువతులను అప్పగించేందుకు వీరు ముందుగా ఒప్పందం కుదుర్చుకుంటారు. వీరిచ్చే ఆర్డర్‌తో బంగ్లాదేశ్‌లోని లోకల్ ఏజెంట్లు అక్కడి పేదలు, అనాథలు, రోహింగ్యాలను ఉపాధి పేరిట తమతో వచ్చేందుకు ఒప్పిస్తారు. ఒకవేళ ఇలాంటి యువతులు తిరిగి వెళ్లకపోయినా.. పట్టించుకునే వారెవరూ ఉండరు. పేదలు కావడంతో తమవారు తిరిగి రాకపోయినా పోలీసులకు ఫిర్యాదు చేసే ధైర్యం చేయరు. అక్రమరవాణా ముఠాలకు ఇదో ధీమా. భారతదేశానికి తీసుకువచ్చే యువతుల్లో రోహింగ్యాలు కూడా ఉండటం గమనార్హం. వీరికి స్థిరనివాసం లేకపోవడంతో అది భారత్ అయినా.. బంగ్లాదేశ్ అయినా ఒకటే. కాబట్టి, వీరు కుటుంబాల కోసం దేశాలు దాటుతుంటారు. -
కుమార్తెను వ్యభిచారానికి ప్రోత్సహించిన తల్లికి..
సాక్షి, ఒంగోలు : కన్న కుమార్తెను వ్యభిచారానికి ప్రోత్సహించిన కేసులో తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తి, వ్యభిచార కేంద్రం నిర్వాహకులకు పదేళ్లు, మరో వ్యభిచార కేంద్రం నిర్వాహకులకు ఏడేళ్లు, బాధితురాలి తల్లికి నాలుగేళ్లు చొప్పున జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు ఫోక్సో కోర్టు జడ్జి జి.దుర్గయ్య సోమవారం తీర్పు చెప్పారు. తల్లిదండ్రులు విడిపోవడంతో వారి 13 ఏళ్ల కుమార్తె తల్లి వద్దే ఉంటోంది. ఈ నేపథ్యంలో తల్లి విల్సన్ అనే ఆటో డ్రైవర్‌తో సహజీవనం సాగిస్తోంది. ఇంటికి వచ్చే విల్సన్ బాలికపై అనేక సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు కన్న తల్లికి చెప్పుకున్నా ఫలితం లేకపోయింది. అనంతరం బాలికను విజయవాడలోని వ్యభిచార గృహానికి రూ.2 లక్షలకు తల్లి అమ్మేసింది. బాలిక అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత వారు మంగళగిరిలోని మరో వ్యభిచార గృహానికి బాలికను అమ్మేశారు. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత వారు చీరాల బోడిపాలెంలోని వ్యభిచార గృహానికి అమ్మారు. బోడిపాలేనికి చెందిన వ్యభిచార గృహం నిర్వాహకులు బాలికను వ్యభిచారం కోసం చిలకలూరి పేట వైపు తీసుకెళ్తుండగా ఆటో ప్రమాదానికి గురైంది. దీంతో బాలిక అక్కడి నుంచి తప్పించుకుని స్థానికుల సాయంతో పొలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడి నుంచి ఒంగోలు చైల్డ్‌లైన్‌కు సమాచారం అందడంతో హెల్ప్ సిబ్బంది బీవీ సాగర్ బాలికను చీరాల ఒన్‌టౌన్ పొలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి రక్షణ కల్పించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న అప్పటి చీరాల డీఎస్పీ డాక్టర్ ప్రేమ్‌కాజల్ బాలికను విచారించి కేసును పక్కాగా విచారించారు. 2016లో కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో కన్న తల్లి చేసిన ఘాతుకంపై సాక్ష్యం చెప్పాల్సిన పరిస్థితి బాధితురాలికి ఉండటంతో తల్లికి సంబంధించిన బంధువులు కొందరు బాలికను బెదిరించారు. డీఎస్పీ బాలికకు రక్షణ కల్పించడంతో బాలిక జరిగిన విషయాన్ని కోర్టులో వివరించింది. కోర్టులో నేరం రుజువైంది. నిందితులైన మారు తండ్రి విల్సన్, విజయవాడకు చెందిన వ్యభిచార గృహ నిర్వాహకురాలు లంక అనూషకు పదేళ్లు చొప్పున జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా, చీరాలకు చెందిన వ్యభిచార గృహం నిర్వాహకురాలు అన్నపురెడ్డి నాగమణి, సాంబ, జతిన్లాల్కు ఏడేళ్ల జైలు శిక్ష, బాధితురాలి తల్లి తల్లి గజ్జెల దీపికకు నాలుగేళ్లు చొప్పున జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. ఈ కేసును అప్పటి డీఎస్పీ ప్రేమ్‌కాజల్ ఛాలెంజ్‌గా తీసుకున్నారు. సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ శ్రీరామ్, వెంకటేశ్వర్లు, హరిబాబు, వెంకట్రావ్, వినోద్‌ల పోలీసు బృందం నిందితులకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించి వారికి శిక్ష పడేలా కృషి చేశారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా ఎం.గార్గేయి, జ్వోసిన్లు వ్యవహరించి నిందితులకు శిక్ష పడేందుకు తమ వాదనలు వినిపించారు. బాలికకు కేసు విచారణలో ఉండగానే పునరావసం, విద్య అభ్యసించేందుకు కలెక్టర్ రూ. రూ.3.75 లక్షలు మంజూరు చేశారు. ఈ నగదును బాలిక పేరుపై బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. -
వ్యభిచార ముఠా గుట్టు రట్టు
కోల్కత్తా : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తోన్న ఓ ముఠాను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ ఘటనలో నలుగురు మహిళలకు, ఇద్దరు మైనర్ బాలికలకు పోలీసులు విముక్తి కల్పించారు. వీరి చేత కోల్‌కత్తాలోని డండం ప్రాంతంలో వ్యభిచారం చేయించేందుకు నిర్వాహకులు తీసుకువచ్చారు. ఈ విషయం తెలిసి బెంగాల్ సీఐడీ ఆఫీసర్లు దాడులు నిర్వహించడంతో విషయం బయటపడింది. 12 మంది నిర్వాహకుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. నిర్వాహకులంతా బెంగాల్‌లోని వివిధ జిల్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఒక్క చోట చేరి తేలికగా డబ్బులు సంపాదిద్దామని ఈ వ్యాపారంలోకి దిగినట్లు చెప్పారు. వ్యభిచార నిర్వాహకుల నుంచి రూ.2.28 లక్షల నగదు, ఓ కారు స్వాధీనం చేసుకుని వ్యభిచారం జరిగిన హోటల్‌ను సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇకపై నన్నెవరూ అలా పిలవలేరు
భిలాయ్: 'నేను చచ్చిపోతే.. ఇక నన్నెవరూ వ్యభిచారి .. రేప్ బాధితురాలు' అని పిలవలేరు అంటూ ఓ అత్యాచార బాధితురాలు తీవ్ర ఆవేదనతో రాసిన సూసైడ్ నోట్లోని మాటలు. తనకు న్యాయం జరగదనే నిరాశతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఇరుగుపొరుగు సూటిపోటి మాటలు, కేసు విచారణలో జరుగుతున్న జాప్యం వెరసి ఆమె ఉసురు తీశాయి. ఛత్తీస్ గడ్ లోని భిలాయ్ కు చెందిన బాధితురాలు గురువారం ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని మృతి చెందింది. చనిపోతే ఇక తనను ఎవరూ ఆ దృష్టితో చూడరని, రేప్ బాధితురాలిగా పిలవరని సూసైడ్ లేఖలో రాయడం అందర్నీ కలచి వేసింది. వివరాల్లోకి వెళితే... 2014 జూన్ లో వైద్యం కోసం వెళ్లిన మహిళపై ఓ వైద్యుడు, ఇద్దరు కానిస్టేబుళ్లు కలిసి అఘాయిత్యానికి తెగబడ్డారు. భిలాయ్ లోని లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రిలో ఈ దారుణం జరిగింది. జాండీస్ వ్యాధి ముదిరిందని బాధితురాలి బంధువులను మభ్యబెట్టిన ఆ వైద్యుడుతో పాటు మరో ఇద్దరు మూడు రోజులపాటు లైంగికంగా దాడికి పాల్పడ్డాడు. అంతటితో వారి దురాగతం ఆగిపోలేదు. ఆ దృశ్యాలను వీడియో తీశామని..ఎవరికైనా చెబితే ఈ వీడియో బహిర్గతం చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. తమ కోరిక తీర్చాలని.. లేదంటే ఆ వీడియోను లీక్ చేస్తామని భయపెట్టి మరీ ముగ్గురూ ఆమెను లొంగదీసుకున్నారు. ఇలా ఆరు నెలల పాటు వారి అరాచకం కొనసాగింది. చివరికి ఆమె గత ఏడాది జనవరిలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. ఈ కేసు విచారణలో ఉండగానే తీవ్ర మానసిక వేదనతో సూసైడ్ నోట్ రాసి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. తాను ఎపుడు కోర్టుకు వెళ్లినా జడ్జి రావడంలేదనీ ..తన తరఫున వాదించే న్యాయవాది వల్ల కూడా ఫలితం లేకపోయిందని వాపోయింది. ఇక తనకు న్యాయం జరుగుతుందున్న నమ్మకం పోయిందని, చివరికి పోలీసులు కూడా నిందితులకే వత్తాసు పలుకుతున్నారని ఆ లేఖలో పేర్కొంది. దీంతోపాటుగా పలువురిని తన ఆత్మహత్యకు బాధ్యులుగా పేర్కొంది. మరోవైపు ఇప్పటికీ తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బాధితురాలి సోదరుడు వాపోయాడు. కేసును ఉపసంహరించు కోవాల్సిందిగా హెచ్చరిస్తున్నారని అతడు తెలిపాడు. కాగా బాధితురాలి సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు కొనసాగించనున్నామని పోలీసులు తెలిపారు. లేఖలో పేర్కొన్న వ్యక్తులందరినీ విచారిస్తామన్నారు. ఫిబ్రవరి 2తేదీన ఈ కేసు విచారణకు రానుంది.