
ఇండోర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కింగ్స్ పంజాబ్ ఆటగాడు మయాంక్ అగర్వాల్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో అదుర్స్ అనిపించాడు. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో భాగంగా లాంగాఫ్‌లో మయాంక్ బంతిని అందుకున్న తీరు ఒక ఎత్తైతే, అక్కడ తనను తాను నియంత్రించుకుంటూ బంతిని గాల్లోనే వేరే ఫీల్డర్ మనోజ్ తివారీకి అందివ్వడం మరొక ఎత్తు. చివరకు ఈ ఇద్దరూ కలిసి స్టోక్స్‌కు అదిరిపోయే స్ట్రోక్ ఇవ్వడం హైలైట్‌గా నిలిచింది.
వివరాల్లోకి వెళితే.. టాస్ గెలిచిన కింగ్స్ పంజాబ్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 84 పరుగుల వద్ద మూడో వికెట్‌గా సంజూ శాంసన్‌ను కోల్పోయిన తర్వాత ఐదో స్థానంలో స్టోక్స్ బ్యాటింగ్‌కు దిగాడు. రెండు ఫోర్లతో మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. కాగా, కింగ్స్ పంజాబ్ స్పిన్నర్ ముజిబ్ ఉర్ రహ్మాన్ వేసిన 13 ఓవర్ ఐదో బంతిని లాంగాఫ్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అయితే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న మయాంక్.. బంతిని బౌండరీ లైన్‌కు కొద్ది దూరంలో అందుకున్నాడు. అదే సమయంలో బౌండరీ లైన్ వద్ద నియంత్రణ కోల్పోతున్నట్లు భావించిన మయాంక్.. అక్కడకు సమీపంలో ఉన్న మనోజ్ తివారీకి అందించి బౌండరీ లైన్ లోపలకి పడిపోయాడు. కాగా, మనోజ్ తివారీ ఆ క్యాచ్‌ను అందుకోవడంతో మయాంక్ చేసిన ప్రయత్నం స్టేడియంలోని ప్రేక్షకుల్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది.