టీమిండియా క్రికెటర్, బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారి తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ చైర్మెన్ స్నేహసిస్ గంగూలీ సూచన మెరకు మనోజ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఈ విషయాన్ని తివారి మంగళవారం విలేకరుల సమావేశంలో అధికారింగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. కాగా మనోజ్ తివారీ గత గురువారం(ఆగస్టు3)న అన్ని రకాల ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
అయితే క్యాబ్ ప్రెసిడెంట్ స్నేహసిస్ గంగూలీ మాత్రం తన నిర్ఱయాన్ని మార్చుకోవాలని మనోజ్‌ను అభ్యర్దించినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లపాటు జట్టులో కొనసాగమని తివారిని గంగూలీ కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు రెండు గంటల పాటు క్యాబ్ అధికారులతో మనోజ్ చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా గత కొన్నేళ్లుగా బెంగాల్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా అతడి సారధ్యంలోని బెంగాల్ జట్టు గత రంజీ ట్రోఫీలో రన్నరప్‌గా నిలిచింది. తివారి తన నిర్ణయాన్ని వెనుక్కి తీసుకోవడంతో మళ్లీ వచ్చే ఏడాది రంజీ ట్రోఫీలో బరిలోకి దిగనున్నాడు.
ఇక మనోజ్ అంతర్జాతీయ కెరీర్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు భారత్ తరపున 12 వన్డేలు, మూడు టి20లు ఆడాడు. వన్డేల్లో ఒక సెంచరీ, అర్ధసెంచరీ ఉన్నాయి. కానీ మూడు టి20ల్లో ఒకసారి మాత్రమే బ్యాటింగ్ అవకాశం దక్కగా 15 పరుగులే చేశాడు. అయితే దేశవాళీ క్రికెట్‌లో మాత్రం అతడికి మంచి రికార్డు ఉంది. దేశవాళీ క్రికెట్‌లో 141 మ్యాచ్‌ల్లో 48.56 సగటుతో 9908 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా, పంజాబ్, రైజింగ్ పుణేలకు ఆడాడు.
చదవండి: రోహిత్ మంచి కెప్టెన్.. కానీ అలా అయితే వరల్డ్‌కప్‌లో కష్టమే: యువరాజ్
Comments
Please login to add a commentAdd a comment