ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కింగ్స్ పంజాబ్ ఆటగాడు మయాంక్ అగర్వాల్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో అదుర్స్ అనిపించాడు. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో భాగంగా లాంగాఫ్‌లో మయాంక్ బంతిని అందుకున్న తీరు ఒక ఎత్తైతే, అక్కడ తనను తాను నియంత్రించుకుంటూ బంతిని గాల్లోనే వేరే ఫీల్డర్ మనోజ్ తివారీకి అందివ్వడం మరొక ఎత్తు. చివరకు ఈ ఇద్దరూ కలిసి స్టోక్స్‌కు అదిరిపోయే స్ట్రోక్ ఇవ్వడం హైలైట్‌గా నిలిచింది.