యూఏఈ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే మహిళల టీ20 వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా అలైసా హీలీ ఎంపిక కాగా.. వైస్ కెప్టెన్‌గా తహిల మెక్‌గ్రాత్ వ్యవహరించనుంది. సీనియర్ స్పిన్నర్ జెస్ జొనాస్సెన్‌ను పక్కన పెట్టిన ఆసీస్ సెలెక్టర్లు.. పేస్ బౌలర్ తైలా వ్లేమింక్‌కు చోటు కల్పించారు.
ఈసారి ప్రపంచకప్ బరిలో ఆసీస్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతుంది. సీనియర్లంతా అంతా జట్టుకు అందుబాటులో ఉన్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా ఈసారి కూడా టైటిల్ సాధించి, వరుసగా నాలుగు టీ20 వరల్డ్‌కప్‌లు సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతుంది.
టీ20 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా జట్టు..
అలైసా హీలీ (కెప్టెన్), డార్సీ బ్రౌన్, యాష్ గార్డ్‌నర్, కిమ్ గార్త్, గ్రేస్ హ్యారిస్, అలానా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, తహిళ మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), సోఫీ మోలినెక్స్, బెత్ మూనీ, ఎల్లిస్ పెర్రీ, మెగాన్ షట్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, జార్జియా వేర్హమ్, తైలా వ్లేమింక్
కాగా, టీ20 వరల్డ్‌కప్ 2024 ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడతాయి. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్తాన్ ఉండగా.. గ్రూప్-బిలో వెస్టిండీస్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, స్కాట్లాండ్ జట్లు పోటీపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment