అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ సబ్ రీజినల్ ఈస్ట్ ఆసియా-పసిఫిక్ క్వాలిఫైయర్-ఏ పోటీల్లో భాగంగా సమోవా దేశంతో జరిగిన మ్యాచ్‌లో వనుఅటు దేశ సీమర్ నలిన్ నిపికో ఒకే ఓవర్‌లో 39 పరుగులు సమర్పించుకున్నాడు.
నిపికో బౌలింగ్‌లో సమోవా దేశ బ్యాటర్ డేరియస్ విస్సర్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. నిపికో మూడు నో బాల్స్ వేశాడు. ఫలితంగా ఓ ఓవర్‌లో 39 పరుగులు వచ్చాయి. అంతర్జాతీయ టీ20ల్లో ఇది సరికొత్త ప్రపంచ రికార్డు.
2007 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్, 2021లో శ్రీలంక బౌలర్ అఖిల ధనంజయ, 2024 ఏసీసీ మెన్స్ ప్రీమియర్ కప్ టీ20 టోర్నీలో ఖతార్ బౌలర్ కమ్రాన్ ఖాన్ ఒకే ఓవర్‌లో 36 పరుగులు (6 సిక్సర్లు) సమర్పించుకున్నారు. బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్, ధనంజయ బౌలింగ్‌లో కీరన్ పోలార్డ్, కమ్రాన్ ఖాన్ బౌలింగ్‌లో దీపేంద్ర సింగ్ ఎయిరీ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్ల ఘనత సాధించారు.
మొత్తం 14 సిక్సర్లు..
నిపికో బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన డేరియస్ విస్సర్.. ఇన్నింగ్స్ మొత్తంలో ఏకంగా 14 సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్‌లో 62 బంతుల్లో 132 పరుగులు చేసిన విస్సర్.. సమోవా దేశం తరఫున శతకం సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
Comments
Please login to add a commentAdd a comment