నేడు సూపర్–8లో భారత్ రెండో మ్యాచ్
బంగ్లాదేశ్‌తో టీమిండియా పోరు
రాత్రి గం.8 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం
నార్త్‌సౌండ్ (ఆంటిగ్వా): టి20 వరల్డ్ కప్‌లో ఓటమి లేకుండా అజేయంగా సాగుతున్న భారత్ సెమీఫైనల్ వేటలో మరో కీలక సమరానికి సిద్ధమైంది.
సూపర్–8 దశలో భాగంగా గ్రూప్–1లో నేడు జరిగే పోరులో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై అలవోకగా నెగ్గిన టీమిండియా అమితోత్సాహంతో ఉండగా... తమ మొదటి మ్యాచ్‌లో ఆ్రస్టేలియా చేతిలో ఓడిన బంగ్లాదేశ్ తీవ్ర ఒత్తిడి మధ్య మరో మ్యాచ్ బరిలోకి దిగనుంది.
ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సెమీఫైనల్‌కు చేరడం దాదాపు ఖాయమవుతుంది. మరోవైపు ఈ మ్యాచ్‌లోనూ ఓడితే బంగ్లాదేశ్ సెమీస్ ఆశలు గల్లంతవుతాయి. బలాబలాలు, ఫామ్‌ను బట్టి చూస్తే మరో సందేహం లేకుండా భారత జట్టే ఫేవరెట్‌గా కనిపిస్తోంది.
రోహిత్, కోహ్లి రాణిస్తే...
టోరీ్నలో భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌లను బట్టి చూస్తే ఓపెనర్లు రోహిత్, కోహ్లిల బ్యాటింగ్‌పై మాత్రమే కాస్త ఆందోళన కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై రోహిత్ అర్ధ సెంచరీ చేసినా, తర్వాతి మూడు మ్యాచ్‌లలో విఫలమయ్యాడు.
తొలి మూడు మ్యాచ్‌లలో విఫలమైన కోహ్లి...అఫ్గాన్‌పై 24 పరుగులు చేసినా అది అతని స్థాయికి తగిన ఇన్నింగ్స్ కాదు. ఈ నేపథ్యంలో బంగ్లాపై వీరిద్దరు చెలరేగాలని జట్టు కోరుకుంటోంది. శివమ్ దూబే కూడా ఆశించిన రీతిలో ఆడటం లేదు. మిడిలార్డర్‌లో లెఫ్ట్ హ్యాండర్‌గా ఏకైక ప్రత్యామ్నాయం కావడంతో అతనికి మరో అవకాశం దక్కవచ్చు.
ఇది మినహా ఇతర అంశాల్లో జట్టు పటిష్టంగా ఉంది. సూర్యకుమార్, పంత్‌ల బ్యాటింగ్‌తో పాటు పాండ్యా కూడా దూకుడుగా ఆడటం భారత్‌కు సానుకూలాంశం. బౌలింగ్‌లో అఫ్గాన్‌పై కుల్దీప్ ఆకట్టుకున్న నేపథ్యంలో తుది జట్టులో ఎలాంటి మార్పూ ఉండకపోవచ్చు.
అన్నింటా తడబాటు...
సూపర్–8కు చేరినా లీగ్ దశలోనూ బంగ్లాదేశ్ ఆట అంతంతమాత్రమే. ఆసీస్‌తో పోరులో కూడా అది కనిపించింది. టాపార్డర్‌లో ఒక్క దూకుడైన బ్యాటర్ కూడా లేకపోవడం జట్టు ప్రధాన బలహీనత. తౌహీద్ ఫర్వాలేదనిపించడం మినహా ప్రధాన బ్యాటర్లు తన్‌జీద్, దాస్, కెపె్టన్ నజు్మల్ వరుసగా విఫలమయ్యారు.
సీనియర్ మహ్ముదుల్లా కూడా ప్రభావం చూపలేదు. రికార్డు స్థాయిలో 9వ టి20 వరల్డ్ కప్ ఆడుతున్న షకీబ్ ఒక్క మ్యాచ్ మినహా బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. 4 ఇన్నింగ్స్‌లలో కలిపి 2 వికెట్లు తీశాడు.
భారత్‌పై అతను ఏమైనా ఆకట్టుకోగలడా అనేది చూడాలి. బౌలర్లు ముస్తఫిజుర్, తన్‌జీమ్, తస్కీన్ నిలకడగా రాణించడం వల్లే బంగ్లా ఇక్కడి వరకు వచ్చింది. వీరు టీమిండియా స్టార్ బ్యాటర్లను ఎంత వరకు నిలువరిస్తారనేది ఆసక్తికరం.
టి20 ప్రపంచకప్‌లో నేడు
వెస్టిండీస్ X అమెరికా
వేదిక: బ్రిడ్జ్‌టౌన్; ఉదయం గం. 6 నుంచి
భారత్ X బంగ్లాదేశ్
వేదిక: నార్త్‌సౌండ్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment