Pakistan Men Women To Tour England Ahead T20 World Cup 2024 Full Schedule Announced, Check Full Schedule - Sakshi
Sakshi News home page

T20 WC 2024: ప్రపంచకప్‌నకు ముందు పాక్‌ కీలక సిరీస్‌.. షెడ్యూల్‌ విడుదల

Published Tue, Jul 4 2023 5:20 PM | Last Updated on Tue, Jul 4 2023 7:16 PM

Pakistan Men Women To Tour England Ahead T20 WC Full Schedule announced - Sakshi

Pakistan Men And Women To Tour England 2024: టీ20 ప్రపంచకప్‌-2024 సన్నాహకాల్లో భాగంగా పాకిస్తాన్‌ వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. వెస్టిండీస్‌, యూఎస్‌ఏలో జరుగనున్న ఈ మెగా టోర్నీకి ముందు పాక్‌ పురుష, మహిళా జట్లు ఇంగ్లండ్‌ టీమ్‌తో తలపడనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ తాజాగా విడుదలైంది.

స్వదేశంలో పాకిస్తాన్‌తో వరుస సిరీస్‌లకు సంబంధించిన తేదీలు ఖరారైనట్లు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. మే 22, 2024 నుంచి ఇంగ్లండ్‌- పాకిస్తాన్‌ పురుష జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది.

ఇక అంతకంటే ముందుగానే అంటే.. మే 11 నుంచి మహిళా జట్ల మధ్య పరిమిత ఓవర్ల క్రికెట్‌ సమరం మొదలుకానుంది. ఇంగ్లండ్‌- పాకిస్తాన్‌ వుమెన్‌ టీమ్‌లు మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనున్నాయి. కాగా టీ20 ప్రపంచకప్‌-2022 ఫైనల్లో ఇంగ్లండ్‌- పాకిస్తాన్‌ తలపడగా.. జో రూట్‌ బృందం జగజ్జేతగా నిలిచింది.

ఇంగ్లండ్‌లో పాకిస్తాన్‌ పర్యటన-2024 పూర్తి వివరాలు
మహిళా జట్ల టీ20, వన్డే సిరీస్‌
►తొలి టీ20 మే 11- ఎడ్జ్‌బాస్టన్‌, బర్మింగ్‌హాం
►రెండో టీ20 మే 17- ది కౌంటీ గ్రౌండ్‌, నార్తాంప్టన్‌
►మూడో టీ20 మే 19- హెడ్డింగ్లీ, లీడ్స్‌

►మొదటి వన్డే మే 23- డెర్బీ
►రెండో వన్డే మే 26- టాంటన్‌
►మూడో వన్డే మే 29- చెల్మ్స్‌ఫోర్డ్‌

ఇంగ్లండ్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ మెన్స్‌
నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌
►తొలి టీ20- మే 22- హెడ్డింగ్లీ, లీడ్స్‌
►రెండో టీ20- మే 25- ఎడ్జ్‌బాస్టన్‌, బర్మింగ్‌హాం
►మూడో టీ20- మే 28- సోఫియా గార్డెన్స్‌, కార్డిఫ్‌
►నాలుగో టీ20- మే 30- ది ఓవల్‌, లండన్‌.

చదవండి: 'మిస్టరీ గర్ల్‌'తో యజ్వేంద్ర చహల్‌.. ధనశ్రీ చూస్తే అంతే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement